హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఈ గుడిలో ముడుపు కడితే భూ సమస్యలు పరిష్కారం అవుతాయట..!

Peddapalli: ఈ గుడిలో ముడుపు కడితే భూ సమస్యలు పరిష్కారం అవుతాయట..!

X
temple

temple

సాధారణంగా భూ వివాదాలు ఉన్నవారు కోర్టులోకి వెళ్లి కేసు వేసి న్యాయవాదులతోకలిసి భూ సమస్యలపై పోరాడతారు. కానీ ఇక్కడ ఒక వింత ఆచారం నడుస్తుంది. భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఈ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి తమ సమస్యలు చెప్పుకుంటే సంవత్సరాల తరబడిన కేసులు కూడా పరిష్కారం అవుతున్నాయట.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

సాధారణంగా భూ వివాదాలు ఉన్నవారు కోర్టులోకి వెళ్లి కేసు వేసి న్యాయవాదులతోకలిసి భూ సమస్యలపై పోరాడతారు. కానీ ఇక్కడ ఒక వింత ఆచారం నడుస్తుంది. భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఈ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి తమ సమస్యలు చెప్పుకుంటే సంవత్సరాల తరబడిన కేసులు కూడా పరిష్కారం అవుతున్నాయట. ఈ గుడి ఎక్కడో తెలుసుకోవాలని ఉందా.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) కామన్ పూర్ గ్రామంలో శ్రీ ఆదివారాహస్వామి వారి ఆలయం ఉంది. స్థలపురాణం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఆది వరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆయన కలలో ఆది వరాహస్వామి ప్రత్యక్షం అయి దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతిపైన శ్రీ మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వెలిశాడు.

అయితే, ఈ విషయం ఎవరికీ తెలియక పోవడంతో క్రమేణా విగ్రహం మరుగున పడింది. ఇటీవల అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తవ్వకాలలో స్వామి వారి విగ్రహం బయట పడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి, ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రాంభించారు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారని హిందువుల నమ్మకం. ఈ దశవతారాల్లో వరాహ అవతారం ప్రసిద్దమైనది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహ స్వామి దేవాలయాలు చాలా అరదుగా ఉన్నయి. చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.. ఒకటి తిరుమల కాగా, ఇంకోటి కమాన్పూర్ మాత్రమే కావడం విశేషం. ఇక్కడ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారి కోరికలు తీరుతుండడంతో అందరూ కూడా స్వామిని వరాల స్వామిగా కొలుస్తున్నారు.

ఇది చదవండి: వందేళ్లనాటి తాళం.. రెండు నిముషాలు తిప్పితేగానీ ఓపెన్ కాదు..! ఎలా పనిచేస్తుందంటే..!

ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. ఇంతలో ఆ భక్తుని కలలో స్వామివారు కనిపించి, తనకు ఏ విధమైన మందిరంగానీ, గోపురం గానీ నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తూ, అక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నాడని పురాణాలు చెపుతున్నాయి. ఎలుక రూపంలో జిల్లాకు తూర్పుదిశగా ఒక బండరాతి మీద చిన్న ఎలుక పరిమాణంలో తొలుత భక్తులకు దర్శనమిచ్చిన ఆదివరహ స్వామివారు, తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి, రెండు అడుగుల కన్నా పెద్దగా పెరిగారు. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం.

ఇది చదవండి: ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. భారీ ప్రాజెక్టుతో ఉద్యోగాలు

స్వామివారికిపొద్దున మాత్రమే, అభిషేకాలు, అర్చనల జరుగుతుంటాయి. సాయంత్రం వేళలో ఉండవు. ఉదయం 9 గంటల లోపు అభిషేకం పూర్తి చేసుకుని స్వామి విగ్రహానికి చందనం పెడుతారు. ఎందుకు అంటే స్వామి వారి రోమాలు(వెంట్రుకలు) బయటకు వస్తాయి. ఇంతటి విశేషం ఉన్న ఈ అవతారంలో వెలసిన స్వామివారిని చూడటానికి భక్తులు అనేక ప్రాంతాల నుండి వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు.

సమస్యలు తొలగుతాయి.

ఈ దేవాలయంలో ఏ సమస్యలు ఉన్నవారు అయినా తమ బాధలు స్వామి వారికి చెప్పుకుని ముడుపు కడితే వారి బాధలు తొలగుతాయని భక్తుల అపార నమ్మకం. ఇక్కడికి ముఖ్యంగా భు వివాదాల్లో చిక్కుకున్న వారు, వీసా కోసం ప్రయత్నాలు చేసే వారు, పిల్లలకి మాటలు రానివారు, సంతానం లేని వారు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వస్తుంటారు. కోరికలు నెర వేరిన భక్తుల సహకారాలతో దేవాలయాన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు.

First published:

Tags: Hindu Temples, Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు