E.Santosh, News18, Peddapalli
రాజుల కాలంలో ప్రజలకు మంచి జరగాలంటూ అప్పటి రాజులు ఎన్నో ఆలయాలను కట్టించారు. అలాంటి ఆలయాల తెలంగాణ (Telangana) లో చాలానే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) మంథని దేవాలయాలకు చిరునామా. ప్రాచీన కాలంలో కీడు జరుగుతున్న రోజులలో మంథనిలో కరువు కాటకాలు రాకుండా, పాడి పంటతో సురక్షితంగా ఉండాలని ప్రాంత నాలుగు మూలాల శివ లింగాల ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. అయితే మంథని గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. అదే 1000 ఏళ్ల కిందటకాకతీయులు నిర్మించిన గౌతమేశ్వర ఆలయం. ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు, విశిష్టత తెలుసుకుందాం.
1000 ఏళ్ల ఆలయం అద్భుతమైన శిల్పకళా వైభవం..
గౌతమేశ్వరాలయం పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో గోదావరినదికి దక్షిణ తీరాన ఉంటుంది. ఇది చారిత్రక పురావస్తు, మతపరమైన ఆధారాలకు సాక్షిగా నిలుస్తోంది. గౌతమ మహర్షి తపస్సు చేసినప్పుడు శివుడు స్వయంభువుగా వెలశాడని.. అందుకే కాకతీయులు ఈ దేవాలయాన్ని అద్భుతమైన శిల కళవైభవంతో నిర్మించారని చరిత్ర కారులు చెబుతారు. గర్భాలయంతో పాటు మూడు మండపాలు రాతి శిలలతో చెక్కగా.. దశాబ్దాలుగా అవి చరిత్రకు ఆడవాళ్లుగా నిలుస్తున్నాయి.
ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగాదక్షిణ తీరాన ఉన్న గోదావరిలో పుణ్య స్నానాలు చేసి శివుడిని దర్శించుకుంటారు. ఈ గోదావరికీ ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోదావరిలో స్నానం చేసిన వారికి 7 ఏడు జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల అపార నమ్మకం. ఇక్కడ గౌతమేశ్వరాలయంతో పాటు సరస్వతి ఆలయం, సీతారాముల ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. ఇక్కడ ప్రతి శివరాత్రికి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చరిత్ర ఇదే చెప్తుంది..
గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో పార్వతీదేవి గంగను వదిలేయమని శివుడు వేడుకోగా, అందుకు శివుడు అంగీకరించలేదు. దాంతో పార్వతి అలక వహిస్తుంది. ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటపెట్టుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు. అక్కడున్న జయని పిలిచి ఆవురూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండుగా, గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోడానికి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తాడు. శివుడ్ని కూడా తనతోపాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా, ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిసాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంలో ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకించాడు. అందుకే గౌతమేస్వర ఆలయం అని పేరు వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana