హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఐడియా అదిరింది.., సెన్సార్ పానీపూరితో ఒకేసారి ఐదుగురికి సర్వ్ చేయొచ్చు

Peddapalli: ఐడియా అదిరింది.., సెన్సార్ పానీపూరితో ఒకేసారి ఐదుగురికి సర్వ్ చేయొచ్చు

పెద్దపల్లిలో

పెద్దపల్లిలో అన్నదమ్ముల వినూత్న పానీపూరీ బిజినెస్

మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఉపాయాలే కొత్తదనం జోడిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని ఆలోచించ లేకపోతున్నారు యువకులు. మొదట్లో చిన్నగానే ప్రారంభమైనా రానున్న రోజుల్లో మంచి లాభాలు వచ్చేలా ప్రణాళిక ఉంటే ఏ వ్యాపారమైనా లాభసాటిగానే ఉంటుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  E. Santosh, News18, Peddapalli 

  ఎదో సాధిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకొని లక్షలు పెట్టి వ్యాపారం చేసి నష్టపోతున్నారు కొందరు. దీంతో ఒత్తిడికి గురయ్యి ఇక ఏమి చేయలేమోనని భావిస్తూ కుంగిపోతున్నారు. కానీ మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఉపాయాలే కొత్తదనం జోడిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని ఆలోచించ లేకపోతున్నారు యువకులు. మొదట్లో చిన్నగానే ప్రారంభమైనా రానున్న రోజుల్లో మంచి లాభాలు వచ్చేలా ప్రణాళిక ఉంటే ఏ వ్యాపారమైనా లాభసాటిగానే ఉంటుంది. అటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన ఈ అన్నదమ్ములు తమకు తెలిసిన చిరు వ్యాపారంలోనే కొత్తదనాన్ని జోడించి దూసుకుపోతున్నారు. తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనికి చెందిన లక్ష్మణ్, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. సంతోష్ హోటల్ మానేజ్మెంట్ చేయగా, లక్ష్మణ్ పీజీ ఫైనాన్స్ చేశాడు.

  హోటల్ మానేజ్మెంట్ చేసిన సంతోష్ కొంతకాలం ముంబైలోని ఓ హోటల్‌లో పనిచేశాడు. లక్ష్మణ్ సైతం ఉద్యోగ ప్రయత్నం చేయగా పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్నారు. ముంబైలోనే పానీపూరి, చాట్ దుకాణం పెట్టారు. అలా ముంబైలో అప్పుడపుడే వ్యాపారంలో నిలదొక్కుకుంటుండగా కరోనా లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా వీరి జీవితం తలకిందులైంది. దీంతో సొంత ఊరి గోదావరిఖని చేరుకున్నారు.

  ఇది చదవండి: సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. పూజలు, టికెట్ల వివరాలివే..!

  గోదావరిఖని చేరుకున్న సంతోష్ లక్ష్మణ్‌లు కొంతకాలం చిన్న చిన్న పనులు చేసినా కుటుంబ పోషణకు అవి సరిపోవనిపించింది. తక్కువ పెట్టుబడితో గోదావరిఖనిలోనే పానీపూరి, చాట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వచ్చిన కస్టమర్స్‌ని ఎక్కువ సమయం వెయిట్ చేయించకుండా త్వరత్వరగా సర్వ్ చేసేలా సెన్సార్‌తో కూడిన పానీపూరి మెషిన్ పెట్టారు.పానీపూరి ఆర్డర్ చేసిన వెంటనే పూరీలో బఠాణీ పప్పు పెట్టి ఇస్తారు.

  ఆ పూరీని అక్కడే ఉన్న చిన్న పైప్ వద్దకు తీసుకెళ్తే.. సెన్సార్ డిస్పెన్సర్ ద్వారా పానీ వచ్చి పూరీలో పడుతుంది. దీంతో ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నా త్వరగా సర్వ్ చేస్తుండడంతో ఫుడ్ లవర్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వేద శ్రీ చాట్ & స్నాక్స్ పాయింట్ పేరుతో వీరు నిర్వహిస్తున్న చాట్ భండార్ మంచి సక్సెస్ అయిందని అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు