హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఈ హెల్తీ దోశ రుచే వేరు..! తిన్నాక మెచ్చుకోవాల్సిందే..!

Peddapalli: ఈ హెల్తీ దోశ రుచే వేరు..! తిన్నాక మెచ్చుకోవాల్సిందే..!

X
టెస్టీ

టెస్టీ దోశ

Telangana: ఈ పోషక దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాల్లో దోశ ఒకటి. అయితే సాధారణంగా మనకు ఎక్కువగా కనిపించే దోశలు మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ పెసరట్టు, ఉప్మా దోశలు కానీ ఇక్కడ మాత్రం ఒక స్పెషల్ దోశ దర్శనమిస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(santosh, News18, Peddapalli)

ఈ పోషక దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాల్లో దోశ ఒకటి. అయితే సాధారణంగా మనకు ఎక్కువగా కనిపించే దోశలు మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ పెసరట్టు, ఉప్మా దోశలు కానీ ఇక్కడ మాత్రం ఒక స్పెషల్ దోశ దర్శనమిస్తుంది. అదే పోషక దోశ పోషక దోశఅంటే ఏంటి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే...

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోనిగంగ నగర్ కు చెందిన అనిల్ అనే యువకుడి హోటల్ లో పోషక దోశ లభిస్తుంది, ఈ పోషక దోశ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఈ దోశ రుచి చూస్తే ఎంత దూరం నుండి వచ్చి ఇక్కడే తింటారు మరి అంతటి రుచిగల దోశ వివరాలివి..

ఈ హోటల్ లో రకాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ దోశ మాత్రం చాలా ఫేమస్.,ఈ దోశ ఎందుకు ఫేమస్ అంటే ఈ తయారీలో అన్ని పోషకాలు సంబధించిన ఫుడ్స్ ఐటమ్స్ వేస్తారు.క్యారెట్, బీట్ రూట్, అల్లం, ఘీ ఇలా నాలుగు రకాలను వేసి దోశ వేస్తారు కాబట్టి. ఇక్కడ రుచి మరియు పోషక ఫుడ్ దొరకడంతో స్థానికంగా కొన్ని వందల హోటల్స్ ఉన్న ఇక్కడ దొరికే దోశ కోసం జనాలు బారు తీరుతారు.

ఇక్కడ దొరికే దోశ లో మరో వెరైటీ ఏంటంటే జీలకర దోశ. ఈ దోశకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జీలకర్ర దోశను అక్కడ ఎక్కువగా వయసు పై బడిన వారు కొంచం అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా హెల్త్ టిప్స్ తెలిసిన వారు ఈదోశలకుప్రాధాన్యత ఇచ్చి తీసుకెళ్తారు. మెుదట్లో కేవలం ముగ్గురుతో ప్రారంభంఅయిన ఈ హోటల్ పోషక దోశలతో ఫేమస్ అయ్యి ఇప్పుడు అన్ని రకాలకు ఫేమస్ అయింది.. దీంతో ఈ హోటల్ చూడటానికి చిన్నది అయినప్పటికీ 13 మందికి ఉపాధి ఇస్తున్నారు.

ఇక్కడ ఈ దోశలో పోషక పదార్థాలు ఎందుకు వేస్తారు. అంటే జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్లు,ఐరన్ కాపర్ ,పొటాషియం,మెగ్నీషియం వంటివి అన్నీ లభిస్తాయి.. అల్లం జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా చూస్తుంది.క్యారెట్‌లో విటమిన్ ఎ, ఉంటుంది, ఇది కళ్ళకు అవసరమైన పోషకం అలానే షుగర్ లెవెల్ ను నియంత్రిస్తుంది. బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పని చేస్తుంది.నెయ్యిలో సహజంగా పాల ప్రోటీన్, విటమిన్ ఎ, డి, కె, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. అందుకు ఎక్కువగా వీటిని ఆహరప్రియులు తినేందుకు క్యూ కడతుంటారని నిర్వాహుకుడు అనిల్ తెలుపుతున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు