హోమ్ /వార్తలు /తెలంగాణ /

Yamaha RX 100 : ఆర్‌ఎక్స్ 100 కావాలా? అయితే ఇక్కడికి రండి: ఈ మెకానిక్ అదిరిపోయేలా తయారు చేసిస్తాడు..

Yamaha RX 100 : ఆర్‌ఎక్స్ 100 కావాలా? అయితే ఇక్కడికి రండి: ఈ మెకానిక్ అదిరిపోయేలా తయారు చేసిస్తాడు..

X
ఆర్​ఎక్స్​

ఆర్​ఎక్స్​ 100 బైకులు

యమహా ఆర్‌ఎక్స్ 100..! ఈ పేరు వినగానే యువకుల్లో చిరునవ్వు, కొంటెతనం తెలియకుండానే వస్తాయి. ఈ బైక్ సౌండ్ వింటే ఆ కిక్కే వేరప్పా అనే భావన ఉండేది. ముఖ్యంగా యువతులను ఆకర్షించడానికి యువకులు ఎక్కువగా RX100 బైక్స్ వాడేవారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(E. Santosh, News 18, Peddapalli)

యమహా ఆర్‌ఎక్స్ 100.. (RX 100)! ఈ పేరు వినగానే యువకుల్లో చిరునవ్వు, కొంటెతనం తెలియకుండానే వస్తాయి. ఈ బైక్ (Bike) సౌండ్ వింటే ఆ కిక్కే వేరప్పా అనే భావన ఉండేది. ముఖ్యంగా యువతులను ఆకర్షించడానికి యువకులు ఎక్కువగా RX100 బైక్స్ వాడేవారు. భారతీయ సినిమాల్లో కూడా ఆర్ఎక్స్100 బైక్స్‌ని హీరోలు ఉపయోగించడం చూశాం. అలాంటి యమహా ఆర్‌ఎక్స్ 100 కొంత కాలంగా కనుమరుగయ్యాయి. భారత్‌లో ఉద్గారాల ప్రమాణాలు, ద్విచక్రవాహన చట్టాలతో ఈ బైకును తీసుకురావడం ఆపివేసింది యమహా (Yamaha) సంస్థ. 1997లో యమహా కంపెనీ ఆర్ఎక్స్‌Zను లాంచ్ చేసింది. కానీ చిన్న వీల్‌బేస్‌తో వచ్చిన Z మోడల్ సైతం కొంత ఆకట్టుకున్నా పెద్దగా సేల్స్ జరగలేదనే చెప్పాలి. ఆ తర్వాత పలు మోడల్స్‌ని యమహా తీసుకొచ్చినప్పటికీ.. యమహా ఆర్ఎక్స్100కి ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి.

ఇప్పటికీ యువతలో యమహా ఆర్ఎక్స్100 బైక్స్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొందరు మెకానిక్‌లు పాత మోడల్స్‌ని మాడీఫై (Modify) చేసి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. అలా పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖని చెందిన మెకానిక్స్ యమహా ఆర్ఎక్స్100ను సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 బైక్స్‌ను మోడిఫై చేస్తూ స్థానికంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెకానిక్స్ (Mechanics) చందు (Chandu), వేణులు (Venu). పాత బండినే కొత్తదానిలా తయారు చేస్తున్నారు. వీరు మాడీఫై చేసిన ఆ బండిని చూస్తే షోరూం నుండి విడుదల చేసిన బండిలాగే ఉంటుంది. యమహా తోపాటు పాత స్ప్లెండర్ బైక్స్‌ను కూడా మాడీఫై చేస్తున్నారు. బైక్స్ కొత్తవిగా ఉండడంతో స్థానికంగా యువకులు పాత బైక్స్‌తో వచ్చి క్యూ కడుతున్నారు.

పాత బండ్లను కొత్తగా మోడలింగ్ చేయడంలో దిట్ట..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వేణు బైక్ మెకానిక్. పాత బండ్లను కొత్తవిగా మార్చడంలో దిట్ట. గత 20 సంవత్సరాలుగా మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట యమహా ఆర్‌ఎక్స్ 100ను కొత్తదానిలా తీర్చిదిద్దాలని భావించి మూలన పడ్డ బండిని కొనుగోలు చేశాడు. ఆ బండిని తన నైపుణ్యంతో ఎంతో చక్కగా మార్చేశాడు. అది చూసిన స్థానిక యువకులు కొందరు తమకు అటువంటి బండినే తయారు చేసి ఇవ్వాలని అడిగారు. అప్పటి నుండి యమహా బండ్లు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నామని మెకానిక్ వేణు తెలిపాడు. బైక్‌ను మాడీఫై చేయడానికి సుమారు రూ. 40 వేల వరకు ఖర్చు అవుతుందని, మెకానిక్ సర్వీస్ చార్జి రూ. 8000 ఉంటుందని వేణు తెలిపాడు.

మహదేవ్ ఆటో మొబైల్స్ 7794809938.

First published:

Tags: Bikes, Local News, Peddapalli, Rx 100, Yamaha