హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ప్రధాని జాతికి అంకితం చేసిన ఆర్ఎఫ్‌సీఎల్ చరిత్ర ఇదే..

Peddapalli: ప్రధాని జాతికి అంకితం చేసిన ఆర్ఎఫ్‌సీఎల్ చరిత్ర ఇదే..

X
ఆర్ఎఫ్‌సీఎల్

ఆర్ఎఫ్‌సీఎల్ చరిత్ర ఇదే

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండం పరిధిలో బొగ్గు నిక్షేపాలు, గోదావరి నది జలాలు, విద్యుత్తు సరఫరా కలిగి ఉన్నందున పూజ్య బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని 1970 అక్టోబర్ 2వ తేదీన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Ramagundam | Peddapalle | Karimnagar | Telangana

E.Santosh, News18, Peddapalli

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండం పరిధిలో బొగ్గు నిక్షేపాలు, గోదావరి నది జలాలు, విద్యుత్తు సరఫరా కలిగి ఉన్నందున పూజ్య బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని 1970 అక్టోబర్ 2వ తేదీన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. అప్పట్లో రామగుండం ఎరువుల కర్మాగారంలో 1,6,89,065 టన్నుల యూరియా ఉత్పత్తి చేసేది. కొన్ని సాంకేతకపరమైన కారణాల ద్వారా అప్పు కూడా భారీగా ఉండడంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 1999 మార్చి 31వ తేదీన మూసివేశారు. రాంగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతోపర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్, మరియు విఎస్ఎన్ అమలు చేసి వారికి తగిన న్యాయం చేసినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు.

ఎరువుల కర్మాగారం పునః ప్రారంభం కొరకు అప్పట్లో పెద్దపల్లి ఎంపి గడ్డం వివేక నందతన సాయ శక్తులను ఉపయోగించి ఎరువుల కర్మాగారాన్ని పునః ప్రారంభానికి మొదటి అడుగు తానై నిలిచాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలతో పాటు ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలిజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ గా రూపుదిద్దుకున్న ఎరువుల కర్మగారంప్రారంభానికి సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఎరువుల కొరత తీర్చడానికి కిసాన్ యూరియాగా మార్కెట్లోకి వస్తుంది. రైతులకు యూరియానే కాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వందల మందికిఉపాధినిస్తుంది ఈ కర్మగారం. అధునాతన టెక్నాలజితో రూపుదిద్దుకున్న ఆర్ఎఫ్ సిఎల్ ప్లాంట్ ను ఈ నెల12న ప్రధాని మోదీ జాతీకి అంకితం చేయనున్నారు.

ఇది చదవండి: మావోయిస్టుల వార్నింగ్ లెటర్.. నేతల గుండెల్లో రైళ్లు..! ఏజెన్సీలో అలజడి

రైతులకు ఎరువుల కొరత తీర్చేరామగుండం ఎరువుల కర్మగారం అధికారికంగా ప్రారంభం కాబోతుంది. దేశ వ్యాప్తంగా రైతులకు ఎరువుల కొరత తీర్చడానికి కిసాన్ యూరియాగా రైతుల ముందుకు వస్తుంది. 2016 ఆగస్ట్ 7న గజ్వేల్ నుంచి ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్ తో పాటుగా తెలంగాణ విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి ప్రధాని మోదీశంకుస్థాపన చేయగా 2021 మార్చి 22న వాణిజ్యపరంగా యూరియా ఉత్పత్తి ప్రారంభించింది. అయితే అధికారికంగా ఈ 12న ప్రధాన మోదీ ప్లాంట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. పెద్ధపల్లి జిల్లా రామగుండంలో మూతపడిన ఎఫ్సీఐ స్థానంలో... ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ను అత్యాదునిక విదేశి సాంకేతిక పరిజ్ఝానంతో నిర్మించారు. అమ్మోనియ ఉత్పత్తికి డెన్మార్క్ టెక్నాలజీ, యూరియా ఉత్పత్తికి ఇటలీ టెక్నాలజీని వినియోగించారు. దాదాపు 373 యంత్రాలను ఆయా దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది.

ఇది చదవండి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై డెడ్ లైన్.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

గతంలో కోల్ బేస్డ్ ప్రాజెక్టు గా ఉన్న ప్లాంట్ ను ఆధునిక రించి ...ఇప్పుడు గ్యాస్ బేస్ ప్లాంట్ గా నిర్మించారు. గతంలో ఉన్న ఎఫ్ సిఐ యూరియ ఉత్పత్తి సామర్థ్యం 15వందల మెట్రిక్ టన్నులు కాగా ప్రస్తుత ఆర్ఎఫ్ సిఎల్ ఉత్పత్తి సామర్ధ్యం 3,850 మెట్రిక్ టన్నులు. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐ) జాయింట్ వెంచర్గా ఈ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీని చేపట్టారు. అర్ఎఫ్సీఎల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల టన్నులు.

ఇది చదవండి: రైతులకు ఇది నిజంగా వరం.. పంటను కాపాడే డివైజ్.. వివరాలివే..!

ఇందులో తెలంగాణకు లభించే ఎరువుల వాటా 06 లక్షల టన్నులు. ఏటా దేశ వ్యాప్తంగా300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ అవసరం ఉండగా.., దేశంలో 250 నుంచి 3వందల లక్షల టన్నుల యూరియ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఇక మిగతా యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో యూరియ కోరతను తీర్చాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మూతపడిన 05 ఎరువుల కర్మాగారాలను పునురుద్దరణకు చర్యలు చేపట్టగా.. అందులో మొట్ట మొదటగా ఉత్పత్తి దశలోకి వచ్చింది మాత్రం రామగుండం ఎరువుల కర్మగారం.

ఇది చదవండి: ఇలాగైతే ఎలా..? అధికారులకు పరుగులు పెట్టించిన కలెక్టర్

రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్ఎఫ్ సిఎల్ ప్లాంట్ లో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.ఇక ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును మల్లవరం-భిల్వారా పైప్లైన్ ద్వారాసరఫరా చేయడం జరుగుతుంది. గతంలో ఏర్పాటు చేసిన ఎఫ్ సి ఐ 1980లో ఉత్పత్తిని ప్రారంభించి... నష్టాల కారణంగా 1999 మార్చి 31న మూతపడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసినా ప్రయత్నం ఫలించడం తో కేంద్రం ఆర్ ఎఫ్ సి ఎల్ (RFCL)కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో 2015.. సెప్టెంబర్ 15 జీరో డేట్ గా నిర్ణయించారు.

ఐదేళ్ల తరువాత ప్లాంట్ నిర్మాణం పూర్తవడంతో గతేడాది నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించి కిసాన్ యూరియాతో మార్కెట్లో కి తరలిస్తుంది. ఇక్కడి నుంచి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ,కర్ణాటక రాష్టాలకు సరఫరా చేస్తారు. తెలంగాణలో సాగుకు అవసరమైన నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుండగా… ఇప్పుడు అవసరమైన ఆర్ఎఫ్ సిఎల్ ద్వార ఎరువుల కోరత తీరనుంది.

First published:

Tags: Local News, PEDDAPALLI DISTRICT, Ramagundam, Telangana