హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈమెవన్నీ పాతకాలం నాటి పద్ధతులే.. ఆ లైఫ్ స్టైల్ కి దండం పెట్టాల్సిందే..!

ఈమెవన్నీ పాతకాలం నాటి పద్ధతులే.. ఆ లైఫ్ స్టైల్ కి దండం పెట్టాల్సిందే..!

X
మట్టిపాత్రలోనే

మట్టిపాత్రలోనే వంట చేసుకుంటున్న కుటుంబం

ప్రస్తుతం అంతా టెక్నాలజీ (Technology) యుగం నడుస్తోంది. ఆహారం పండించడం దగ్గర నుంచి తినడం వరకూ ప్రతీది సాంకేతికతతోనే ముడిపడి ఉంది. కానీ అదే ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. దీంతో పాతకాలం నాటి విధానాలకు మళ్లీ ఆదరణ దక్కుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

ప్రస్తుతం అంతా టెక్నాలజీ (Technology) యుగం నడుస్తోంది. ఆహారం పండించడం దగ్గర నుంచి తినడం వరకూ ప్రతీది సాంకేతికతతోనే ముడిపడి ఉంది. కానీ అదే ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. దీంతో పాతకాలం నాటి విధానాలకు మళ్లీ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా యువత వీటిపట్ల ఆకర్షితులవుతున్నారు. పల్లెటూరు, వాతావరణం, వ్యవసాయం, మట్టి పాత్రల్లో భోజనం, ప్రకృతి సిద్ధంగా పండించిన ధాన్యాలు, కురగాయలతో వంటకాలు ఇవన్నీ ప్రాచీన కాల పద్దతులు. ఇప్పుడు ఉన్న రోజుల్లో కనుమరుగైన ప్రాచీన పద్దతులను పాటిస్తూ పెద్దపల్లి జిల్లా ముత్తరం మండలం హరిపురానికి చెందిన మైథిలి అనే యువతి, వారి కుటుంబం పాత పద్దతులను ఇష్ట పడుతూ అదే పద్దతుల్లో జీవనం సాగిస్తున్నారు.

మట్టిపాత్రల్లోనే వంట

తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) కు చెందిన ఓ కుటుంబం ఇప్పటికీ పూర్వపు జీవనశైలినే అవలంభిస్తోంది. ముఖ్యంగా ఆ కుటుంబానికి చెందిన యువతి మైథిలి.. ప్రకృతి ప్రేమికురాలు. భూమిని ప్రేమించడం, వ్యవసాయం చేయడం, దేశీ విత్తనాల సాగుచేయడం అంటే మైథిలికి ఎంతో ఇష్టం. పాతకాలం నాటి పద్ధతులతో అప్పట్లో ఎలాంటి రోగాలు లేకుండా జీవించేవారని.. ఇప్పటి పద్ధతుల వల్ల రసాయనాలతో పండించిన పంటలు తినాల్సి రావడంతో రోగాల బారిన పడుతున్నామని మైథిలి చెబుతోంది. అందుకే పూర్వపు పద్ధతుల్లో జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది.

ఇది చదవండి: పులిలాంటి కుక్క..ఈ రైతు ఐడియా అదుర్స్ కదూ!

మైథిలి, ఆమె కుటుంబం కేవలం వారి సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యానే తింటారు. అది కూడా మట్టిపాత్రల్లోనే వంట చేసుకుంటారు. నీటిని కూడా ఇత్తడి, రాగి బిందెల్లో పెట్టుకుంటారు. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వంటివాటికి వీరు పూర్తిగా దూరం. మట్టిపాత్రల విలువ, వాటి గొప్పతనం తెలియకనే జనం నాన్ స్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మైథిలి చెబుతోంది. మట్టిపాత్రలు వినియోగించడం ద్వారానే మన పెద్దలు చాలా ఏళ్లు ఆరోగ్యంగా జీవించగలిగారని.. అవి చేసే మేలు మందులు కూడా చేయవంటున్నారు.

జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారానే అనేది మైథిలి మాట. ఇక షుగర్ వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే డయాబిటిస్ నుండి విముక్తి పొందుతారు. అందుకే మానవ జీవన శైలి లో మార్పు రావాలి అంటున్నారు మైథిలి.ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలువాడుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని.. అవి తయారు చేసేవారికి ఉపాధి కల్పించినట్లవుతుందని మైథిలి చెబుతోంది.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు