హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఊరి మొత్తానికి నీడని ఇచ్చే 600 ఏళ్ల నాటి మర్రిచెట్టు.. ఎక్కడో తెలుసా.?

ఊరి మొత్తానికి నీడని ఇచ్చే 600 ఏళ్ల నాటి మర్రిచెట్టు.. ఎక్కడో తెలుసా.?

X
పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో 600 ఏళ్లనాటి మర్రిచెట్టు

పది తరాలుగా ఈ ఊళ్ళో ఈ చెట్టే ఒక అడ్రస్. సుమారు 600 ఏళ్ల క్రితం నుండి ఈ మర్రిచెట్టు ఉంటున్నట్లు అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. అలాగే అక్కడ ఉన్న భారీ ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

E.Santosh, News18, Peddapalli

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) అంటేనే చారిత్రక సంపదకు నిలయం. వందల ఏళ్ల నాటి కట్టడాలు చెక్కుచెదరకుండా ఇక్కడ ఉన్నాయి.. అంతే వైభవంతో విరాజిల్లుతున్నాయి. ధూళి కట్ట, రామగిరి కోట, రాముడు గుండాలు, జలపాతాలు ఇలా ఎన్నో వందల ఏళ్ల క్రితం నుండి ఉన్న అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాటితో పాటే అదే కోవలోకి వస్తోంది 600 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు. అంత పెద్ద భారీ సైజులో ఉన్నప్పటికీ ఈ మర్రిచెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతుంది. ఈ చెట్టు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరులో అనే గ్రామంలో ఉంటుంది. ఈ చెట్టు ఎవరు నాటారు అనేది ఇప్పుడైతే ఎవరికీ తెలియదు. ఈ ప్రశ్న సందిస్తే అది రకరకాల పురాణాలు తెలుసుకోవాలి.

ఎందుకంటే ఈ చెట్టు గత పది తరాల నాటి నుండి ఇక్కడే ఉందని ఇక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ చెట్టు పేరు మర్రి చెట్టు.. పది తరాలుగా ఈ ఊళ్ళో ఈ చెట్టే ఒక అడ్రస్. సుమారు 600 ఏళ్ల క్రితం నుండి ఈ మర్రిచెట్టు ఉంటున్నట్లు అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. అలాగే అక్కడ ఉన్న భారీ ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి. అంతేకాక ఆ గ్రామ ప్రజలు ప్రతి ఎండాకాలంలో ఈ చెట్టు కింద సేద తీరుతారని చెపుతున్నారు. చుట్టూ పక్క గ్రామ ప్రజలు కూడా ఈ చెట్టు వద్దకు తీర్ధ యాత్రలకు వచ్చి చెట్టు కింద వండుకొని తిని సేదదీరుతారని చెప్తున్నారు.

ఇది చదవండి: డిగ్రీ చదివే కుర్రాడి పావ్ బాజీ బండి.. సాయంత్రమైతే క్యూ కట్టాల్సిందే..!

ఈ మర్రి మహా వృక్షం..

600 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మర్రిచెట్టు సుమారు 10 గుంటల విస్తీరణంలో పెద్ద పెద్ద వేర్లతో భారీ వృక్షంగా ఉంటుంది. ఆ చెట్టు కింద ఎంతో విశాల వంతంగా ఉంటుంది. గీత కార్మికులు, పొలాలలో పనికి పోయే రైతులు, రోడ్డుపై అటువైపు వెళ్తున్న వాహనదారులు ఇక్కడ కాసేపు సేద తీరేందుకు ఇష్టపడతారు.

మర్రి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు

మ‌ర్రిచెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌ర్రి చెట్టు కాయ‌ల‌ను తినడం వ‌ల్లే కాకులు వందేళ్లు బ్ర‌తుకుతున్నాయ‌ని చాలా మంది పెద్ద‌లు అంటుంటారు. మ‌ర్రి చెట్టు శీత‌ల స్వ‌భావాన్ని క‌లిగి ప్రాణుల‌కు జీవ‌శ‌క్తి అందిస్తూ ఉంటుంది. అందుకే మనం ఈ చెట్టు కిందకి వెళ్ళగానే మనకి ఒక నిండుగా శ్వాస అందిన భావన కలుగుతుంది. వైశాఖ మాసంలో మాత్రమే ఈ చెట్టు కాయ‌ల‌ను కాస్తుంది. ముఖ్యంగా ఉష్ణ శ‌రీర‌త‌త్వం ఉన్న వారికి ఈ పండ్లు వ‌ర ప్ర‌సాదం లాంటివి. మ‌ర్రిపుల్ల‌ల‌తో దంతాల‌ను రెండు పూట‌లా శుభ్రం చేసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గి దంతాలు దృఢంగా మారుతాయి.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు