హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఈ అంగన్వాడీ కేంద్రం ఇతర రాష్ట్రాలకే ఆదర్శం.. ఎందుకో తెలుసా?

Peddapalli: ఈ అంగన్వాడీ కేంద్రం ఇతర రాష్ట్రాలకే ఆదర్శం.. ఎందుకో తెలుసా?

X
టీచర్

టీచర్ గొప్పతనం

Telangana: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థలలో సిబ్బంది, ఉద్యోగులలో ఎక్కువమంది మాటలు చెప్పి పూటలు గడిపి కోటలు కట్టుకునే వారు ఎక్కువయ్యారు. వీళ్ళు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి ఇంటి గల్లాలు నింపుకుంటుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థలలో సిబ్బంది, ఉద్యోగులలో ఎక్కువమంది మాటలు చెప్పి పూటలు గడిపి కోటలు కట్టుకునే వారు ఎక్కువయ్యారు. వీళ్ళు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి ఇంటి గల్లాలు నింపుకుంటుంటారు. ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి వచ్చినా మంచిదే అనుకుంటూ ఎలా నొక్కాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఇక్కడ ఓ మహిళా మూర్తి మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నారు.

ఆమె చేసే పనుల కోసం ప్రభుత్వం నుండి వచ్చే జీతం కూడా తిరిగి ఖర్చు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మోర్ముర్ గ్రామానికి చెందిన ఆంగన్ వాడి స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బడిని సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు కూడా వచ్చి చూసి వెళ్తుంటారు. మరి ఈ స్కూల్ కి ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయంటే అందుకు ఓ మహిళనే కారణం.

ఈ అంగన్వాడీ బడికి ఇంతటి మంచి పేరు రావడానికి ముఖ్య కారకులు ఉపాధ్యాయురాలు పెండ్యాల విమల. ఈవిడ జీవితం.. ఈవిడ జీతం కూడా బడి కోసం, బడి పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రం మాత్రమే నిర్మించింది కానీ ఉపాధ్యాయురాలు మాత్రం అందులో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ బడిలో కరెంట్, ఫ్యాన్లు, బోర్, ఇంకా ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు కూడాఈవిడే కడుతున్నారట.

చిన్న తనంలో ప్రాథమిక విద్య అందించడంలో అంగన్ వాడీ టీచర్ల పాత్ర ఎంతో గొప్పది. దీంతో పాటు గర్భీణీ స్త్రీలకు ప్రభుత్వం పోషక, పౌష్టిక ఆహారం అందిస్తారు. కానీ మోర్ముర్ అంగన్వాడీ కేంద్రంలో మాత్రం వాటితో పాటు స్త్రీ మూర్తులకు శ్రీ మంతం, పిల్లలకి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, సంవత్సరానికి ఓ సారి ఎక్సకర్షన్, పిల్లల పుట్టిన రోజు వేడుకలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఉపాధ్యాయురాలు సొంత ఖర్చుతో చేస్తారట. తాను చేస్తున్న ఖర్చు మళ్ళీ బిల్లు వచ్చేది కాదు.. ఎవరో డోనేషన్ చేసేది కూడా కాదు. తనకు ప్రతి నెల వచ్చే జీతం నుండే ఖర్చు చేస్తున్నారు.

స్కూల్ లో కూరగాయల తోట..

ఈ అంగన్వాడి కేంద్రంలో కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. అందులో పండిన కూరగాయలని మాత్రమే వండి పిల్లలు పెడుతారు. ఈ తోటలో టమాటో, చిక్కుడికాయ, వంకాయ, తోట కూర, పాల కూర, సొరకాయ, పచ్చి మిర్చి, కరివేపాకు ఉన్నాయి.

విద్యతో పాటే మమకారం..

ఈ ఉపాధ్యాయురాలికి పిల్లలు అంటే చాలా ఇష్టం.. అందుకే పిల్లలు ఏది కావాలన్నా, వారికి ఏది ఇవ్వాలన్నా క్షణం కూడా ఆలోచించరు. వారికి ఓనమాలు నేర్పడంతో పాటు వారిపై ఉన్న ప్రేమతో అమ్మలా వారి ఆలన పాలన చూసుకుంటారు. అన్నం తినిపించడం, ఏడ్చే వారిని ఆడించడం చేస్తూ వారికి రోజూ బడికి వచ్చేలా చేస్తూ అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉపాధ్యాయురాలికి మూడు సార్లు జిల్లా కలెక్టర్లచే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డ్స్ కూడా వచ్చాయి.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు