హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: బావి నీరే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం.., కానీ రోడ్డు వేసిన అధికారులు చేసిన పనికి

Peddapalli: బావి నీరే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం.., కానీ రోడ్డు వేసిన అధికారులు చేసిన పనికి

పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్వాకం

Peddapalli: పూర్వకాలంలో నీటి కాలుష్యం అనే మాటే ఎరుగం. ప్రజలు చెరువులు, బావుల్లోని నీటిని ఎలాంటి భయం లేకుండా తాగేవారు. అందుకే అప్పట్లో రాజులు, జమీందారులు, ఊరిపెద్దలు మంచినీటి చెరువులు, బావులు తవ్వించేవారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  E. Santosh, News18, Peddapalli

  పూర్వకాలంలో నీటి కాలుష్యం అనే మాటే ఎరుగం. ప్రజలు చెరువులు, బావుల్లోని నీటిని ఎలాంటి భయం లేకుండా తాగేవారు. అందుకే అప్పట్లో రాజులు, జమీందారులు, ఊరిపెద్దలు మంచినీటి చెరువులు, బావులు తవ్వించేవారు. కాలక్రమేణా అలాంటి బావులు, చెరువులు మురికి కూపాలుగా మారిపోయాయి. ఇప్పుడున్నవి మంచినీటి బావులు అని చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. నీటి కాలుష్యం కారణంగా లక్షలు ఖర్చు చేసి వాటర్ ఫిల్టర్లు కొనుక్కుంటున్నాం. అయినా ఆ నీటిలోనూ అనుమానమే. స్వచ్ఛ, శుద్ధమైన నీరు అనే విషయాన్నీ ఎప్పుడో మర్చిపోయామనే చెప్పాలి. కానీ ఆ ఊరి ప్రజలకు మాత్రం ఆ బావి ఆరోగ్యాన్నిచ్చే అమృతం. ఆ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు ఉండవని ఏళ్లకేళ్లుగా బావి నీరే తాగుతున్నారు.

  తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) తెనుగువాడకు చెందిన ప్రజలు స్థానికంగా ఉన్న మంచి నీటి బావి నుంచే త్రాగు నీరు తోడి తెచ్చుకునేవారు. పూర్వం ఓ విశ్వబ్రాహ్మణుడి భార్య మరణ అనంతరం తన భార్య గుర్తుగా ఊరి ప్రజలకు ఉపయోగపడే విధముగా ఇక్కడ మంచి నీటి బావి తవ్వించాడని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ భావిని అవుసుల బావిగా పిలిచేవారు.

  ఇది చదవండి: వణికిస్తున్న డెంగ్యూ జ్వరం: అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

  అప్పటి నుండి జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ ఆ బావి నీరే తాగేవారు. ఆ రోజుల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నీటి కష్టాలు వచ్చినా అవుసుల బావిలో మాత్రం నీరు తగ్గలేదని, జిల్లా వ్యాప్తంగా ఆ బావి మీదే ఆధారపడేవారమని ప్రజలు చెబుతున్నారు. తాతముత్తాతల కాలం నుండి ఇప్పటి వరకు అవుసుల బావి నీరునే మంచి నీరుగా వాడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి శుద్ధి చేసే వాటర్ ఫిల్టర్ నీరు తాగినా తమకు ఆరోగ్య సమస్యలు వచ్చేవని బావి నీరు తాగడం వలన అనారోగ్యానికి గురైన సందర్భాలు లేవని చెప్పుకొచ్చారు.

  అటువంటి మంచి నీటి బావి అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యి మంచి నీటి బావి కాస్త మూడు నెలల క్రితం మురుగు నీరుగా మారింది. ఎల్లమ్మ చెరువు పక్కన ఉన్న రోడ్డు మరమ్మతులు చేస్తూ పక్కనే ఉన్న బావిని చూసి కూడా మురుగు నీరు అందులోకి చేరేలా చేశారని, దీంతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన మంచి నీటి బావి మురుగు నీరుగా మారి, నిరుపయోగంగా తయారైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మునిసిపల్ అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు వేడుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు