హోమ్ /వార్తలు /తెలంగాణ /

గ్రంథాలయంలో పుస్తకాలు ఉన్న చదివే సదుపాయం మాత్రం లేదు!..

గ్రంథాలయంలో పుస్తకాలు ఉన్న చదివే సదుపాయం మాత్రం లేదు!..

X
శిథిలావస్థకు

శిథిలావస్థకు చేరిన గ్రంథాలయం

Telangana: పెద్దపల్లి జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాల్లో,ప్రత్యేక సదుపాయాలు కల్పించి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచామని ఇటీవలజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santosh, News18, Peddapalli)

పెద్దపల్లి జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాల్లో,ప్రత్యేక సదుపాయాలు కల్పించి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచామని ఇటీవలజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. అయితే, పోటి పరీక్షలకు అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రంధాలయంలో సదుపాయాలు లేవని అంటున్నారు పాఠకులు.

దీంతో పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళి చదవాల్సి వస్తుందని పాఠకులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రామగుండంలోనిఅంతర్గామ రోడ్డులో జెన్కోకి చెందిన రేకుల షెడ్డులో ఈ లైబ్రరీని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రంథాలయానికి అంటూ ప్రత్యేక భవనం లేదు. ఈ షెడ్డు చాలా కాలం నాటిది కావడంతో గోడలు అన్ని పాత పడిపోయి ఉన్నాయి. ఎండాకాలం ఉక్కపోత, వర్షాకాలం వస్తె పూర్తిగా గోడలన్నీ నాని పోతాయి.

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్తితులల్లో గ్రంథాలయాల కన్నా దేవాలయాలు ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ చూసినా ఊరికో గుడి ఉంటంది కానీ ఊరికో గ్రంధాలయం అన్న మాట వినపడదు. గుడికెల్లి మొక్కుతే దేవుడు వరం ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ గ్రంథాలయానికి వెళ్తే మాత్రం విజ్ఞానం పెరుగుతుంది. లైబ్రరీల ప్రాముఖ్యత ఎంతో తెలిసినా వాటిని అభివృద్ది చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారు.

ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ గ్రంథాలయం ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యం. ఈ గ్రంధాలయంలో చాలా వరకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఈ పరిసరాల ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని ప్రతి రోజూ వచ్చి సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఇక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో దీని ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది.

ఇప్పుడైతే దాదాపు గ్రంధాలయం పూర్తిగా పాత పడిపోయింది. మెరుగైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఈ గ్రంథాలయానికి రావడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదని అంటున్నారు స్థానికులు. మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో కావలసిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదువుకొని మళ్ళీ తీసుకొస్తున్నారని లైబ్రరీ ఉద్యోగి సంపత్ తెలిపారు.

ఈ గ్రంథాలయంలో లభించే పుస్తకాలు ప్రస్తుతానికి 6084 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, అందులో ఆంగ్లం, హిందీ, ఉర్దూ మూడు భాషల పుస్తకాలు ఉన్నట్లు రికార్డులో పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగ పడే పుస్తకాలు కొన్ని ఉన్నా పూర్తి స్థాయిలో లేవని ఇక్కడి విద్యార్థుల కొంత వరకు నిరాశ చెందుతున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు