Home /News /telangana /

PEDDAPALLI THERE IS NO GOD IN THIS TEMPLE BUT PEOPLE GO TO SEE THE BEAUTIFUL GARDEN IN PEDDAPALLI PSE BRV PRV

Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?

ఆండాళమ్మ

ఆండాళమ్మ దేవత ఆలయం

దేవాలయం ఉందంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు కొలువుదీరి ఉంటాడు. దైవదర్శనం కోసం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతు ఉంటుంది. నిత్యం భగన్మామస్మరణతో ఆ ఆలయం మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India
  (E.Santosh, News 18, Peddapalli)

  దేవాలయం (Temple) ఉందంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు కొలువుదీరి ఉంటాడు. దైవదర్శనం కోసం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతు ఉంటుంది. నిత్యం భగన్మామస్మరణతో ఆ ఆలయం మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఓ అద్భుతమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడని అనుకుంటున్నారా?. అందులో ఏ దేవుడి దేవతా విగ్రహం లేదు. శతాబ్దాల కాలం నాడు నిర్మించిన ఈ ఆలయంలో కొన్ని కారణాల వలన విగ్రహ ప్రతిష్ట జరగలేదు. దీంతో అనాదిగా ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ ఆలయం మంచి షూటింగ్ స్పాట్ మారింది.

  దేవత లేని గుడిగా..

  భక్తులు కనిపించని దేవాలయంగా ఊరి చివరన విసిరివేసినట్లుగా ఉన్న ఈ ఆలయం పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్‌ గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయానికి అనుబంధంగా శతాబ్దాల క్రితం నిర్మాణం జరిగింది. ఆండాళమ్మ (Andalamma) అమ్మవారి కోసం ఈ గుడి కట్టినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. గుడైతే కట్టారు కాని..అందులో అమ్మవారిని ప్రతిష్టించలేదు. దీంతో దేవత లేని గుడిగా మిగిలిపోయింది ఈ ఆలయం. అప్పట్లోనే ఎంతో అద్బుతంగా నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం కొంత శిథిలావస్థకు చేరుకున్నా రూపురేఖలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. అందమైన గోపురం, భారతీయ సంస్కృతి ప్రతిబింభించేలా వివాహ వేడుక, పట్టాభిషేకం ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను ఆలయ గోపురంపై చెక్కారు. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరుపక్కల దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. మండపానికి కొద్ది దూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చే విధంగా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు.

  ఆండాళ్లమ్మ ఆలయ నిర్మాణానికి అప్పటి రాఘవపూర్ గ్రామ సంస్థానాధీషుడు ఎరబాటి లక్ష్మీనర్సింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు అంకురార్పణ చేశారు. రంగనాయకస్వామి ఆలయం నుంచి 500 మీటర్ల దూరంలో గుట్టకు సమీపంలో ఆలయం నిర్మించారు. ఏటా నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి ప్రతిపాదిత రోప్‌ వే ద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి కల్యాణ వేడుక జరిపించాలన్న అద్భుతమైన ఆలోచన కూడా కొన్నేళ్ల క్రితం చేశారు. ఆండాళ్లమ్మ ఆలయ నిర్మాణం పూర్తైనప్పటికి రోప్ వే నిర్మించేందుకు ఇంజినీర్లు రాకపోవడంతో గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది.

  రెండు కిలోమీటర్ల వంతెన.. 300 కిలోమీటర్లతో సమానం.. ఎక్కడో మీరే చూసేయండి

  అంతే కాదు రాఘవపూర్ గ్రామ సంస్థానాధీషుడు లక్ష్మీకాంతరావు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆలయ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అండాళ్లమ్మ ఆలయ అభివృద్ధిపై తరువాతి కాలంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రధాన ఆలయమైన రంగనాయకస్వామి దేవస్థానానికి సంబంధించిన 400 ఎకరాల మాన్యం ఆక్రమణకు గురి కావడంతో ఆండాలమ్మ ఆలయ నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. ఎంతో అద్బుతంగా నిర్మించాలని పట్టుబట్టిన దేవాలయం... దేవత లేని ఆలయంగా మిగిలిపోవడంతో చివరకు షూటింగ్‌ స్పాట్‌గా మారింది.  పగలు షూటింగ్‌ స్పాట్‌గా, సాయంత్రం అసాంఘిక కార్యకలాపాలు: ధర్మాబాద్ గ్రామంలో గతేడాది పల్లె ప్రకృతి వనంలో భాగంగా ఆండాళ్లమ్మ ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో అందమైన ఉద్యానవనం నిర్మించారు. ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు కూడా వేసి , ఉద్యానవనాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఎత్తయిన గుట్టల మధ్య, సువిశాల మైదానంలో ఏర్పాటు చేసిన వనం ఆలయానికి మరింత అందాన్ని తీసుకొచ్చి మంచి లొకేషన్‌గా మారిపోయింది. దాంతో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు, మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్‌ జరుగుతున్నాయి. దశాబ్ధాల కాలం నుంచి ఆదరణకు నోచుకోని ఇంతటి అద్భుతమైన దేవాలయానికి ఆధ్యాత్మికశోభ తేవాలని, జిల్లాలో మరో పుణ్యక్షేత్రంగా మార్చాలని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అంటున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hindu Temples, Local News, Peddapalli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు