Home /News /telangana /

PEDDAPALLI THE VRAS PROTESTED BY RAISING A BONAM ASKING CM KCR TO IMPLEMENT HIS PROMISES FOR VRAS PSE BRV PRV

Peddapalli: సీఎం కేసీఆర్ మనసు మార్చాలంటూ బోనం ఎత్తి నిరసన తెలిపిన వీఆర్ఏలు 

బోనం

బోనం ఎత్తిన వీఆర్ఏలు

గత 18 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో వీఆర్ఏలు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E. Santosh,  News 18, Peddapalli)

    తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల (VRA) సమస్యలు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్ (CM KCR) తమకు ఇచ్చిన హామీల మేరకు వాటిని అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పే స్కేల్ (Pay scale) వర్తింపజేయాలంటూ వీఆర్ఏలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో గత 18 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు.పెద్దపల్లి  (Peddapalli) జిల్లాలో వీఆర్ఏలు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేసారు. బోనం ఎత్తిన మహిళా వీఆర్ఏలు.. తమ సమస్యలు తీరాక బంగారు ముక్కుపుడకతో బోనం (Bonam) ఇస్తామంటూ పోచమ్మకు మొక్కుకున్నారు.

    Mulugu: పరీక్ష రాసింది ఒక్కడు.. రాయించింది మాత్రం ఎనిమిది మంది ప్రభుత్వోద్యోగులు

    సీఎం కేసీఆర్ సార్, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి:

    ఉద్యోగ క్రమబద్దీకరణ, పేస్కేల్ వర్తింపు తదితర సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana government) వారికి హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదు. సీఎం కేసీఆర్ ఇకనైనా తమ సమస్యలపై స్పందించాలని గత 18 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా వీఆర్ఏ జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని, పే స్కేల్ వర్తింప చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని అన్నారు.



    అలాగే వీఆర్ఏ కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా ప్రకటించారని కానీ ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేకపోవడం వల్లనే గత 18 రోజులుగా న్యాయం కోసం దీక్షలు చేపడుతున్నామని ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని పెద్దపల్లి వీఆర్ఏ జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు.

    KG to PG Institute: వావ్​..అదిరిపోయిందిగా.. తెలంగాణలో తొలి KG to PG విద్యాలయం ఇదే..

    వీఆర్ఏ జేఏసీ మహిళా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉద్యోగ క్రమబద్దీకరణ,పేస్కేల్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని గుర్తించి మా సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నమని పెద్దపల్లి వీఆర్ఏ జేఏసీ జనరల్ సెక్రెటరీ లక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనలో భాగంగా..వీఆర్ఏ ఉద్యోగులతో కలిసి పోచమ్మకు బోనం ఎత్తి.. సీఎం కేసీఆర్ మనసు మార్చాలని మొక్కుకున్నట్లు లక్ష్మి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Local News, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు