గుండెల నిండా విషాదంతో ఓ పదోతరగతి విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ఓ పక్క తండ్రి మరణం…మరోవైపు పదోతరగతి పరీక్షలు ఉండటంతో ఆ విద్యార్థి గుండెనిబ్బరంతోనే పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి చితి కార్యక్రమం నుండి నేరుగా ఎగ్జామ్ సెంటర్కు వెళ్లాడు.
విషాదం నుండి పరీక్షకు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నర్రశాలపల్లి కి చెందిన విద్యార్థి బాలాజీ తండ్రి ఈదునురి స్వామి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో బాలాజీ పరీక్ష రాసే రోజుకు..అతని తండ్రి చనిపోయి తొమ్మిదో రోజు కావడంతో దిన కర్మలు చేయాల్సి ఉంది. దీంతో పొద్దున తన తండ్రి చితి వద్ద పనులు.. ముగించుకొని వెంటనే పరీక్ష కేంద్రానికి(exam center) వెళ్ళి పరీక్షకు హాజరయ్యాడు విద్యార్థి బాలాజీ.
కుంగిపోకుండా..ఎగ్జామ్ సెంటర్కు
పదో తరగతి విద్యార్థి మనసంతా బాధ నిండి ఉన్నా…కుటుంబానికి కొండంత అండ చనిపోయాడని కుంగిపోకుండా..తానే ఇకపై ఆ కుటుంబానికి ఆధారం అని తెలుసుకున్నాడు. తన కుటుంబం బాగుండాలంటే తన భవిష్యత్తు బాగుండాలి. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబసభ్యులను సంతోషంగా చూసుకోవాలి. అవన్నీ జరగాలంటే పునాది లాంటి పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. అందుకే గుండె నిండా బాధ ఉన్నా ఎగ్జామ్ సెంటర్ వెళ్లి పరీక్ష పూర్తి చేశాడు.
తండ్రి చనిపోయిన బాధలో కూడా భవిష్యత్తూ కొరకై పరీక్షకు హాజరు కావడానికి వెళ్లిన అతన్ని చూసి పలువురు కంటతడిపెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.