Home /News /telangana /

PEDDAPALLI THE SON IN LAW WHO KILLED HIS AUNT AND UNCLE IN ANGER THAT THEY WERE CREATING PROBLEMS IN HIS LIFE KNR PRV

Couple murder: అర్ధరాత్రి దంపతులు ఆత్మహత్య.. భూ తగాదాలనుకొని ఫిర్యాదు చేసిన కొడుకు.. పోలీసుల విచారణలో షాకింగ్​ ట్విస్ట్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథని పోలీస్ స్టేషన్  పరిధిలో బుధవారం  జంటహత్య జరిగింది. అయితే భూ తగాదాలనుకుని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, అసలు ట్విస్టు విచారణలో బయటపడింది.

    (P. Srinivas, News 18, Karimnagar)

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథని పోలీస్ స్టేషన్  పరిధిలో బుధవారం  జంటహత్య (Couple murder) జరిగింది.  కేసు విచారణ అనంతరం పెద్దపల్లి డీసీపీ రవీందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుని అరెస్ట్ వివరాలు వెల్లడించారు . మే 10, 2022 రోజు అర్ధరాత్రిపూట మంథని మండలం చల్లపల్లి గ్రామంలో కొత్త సాంబయ్య , అతని భార్య లక్ష్మిలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. భూ తగాదాలతో తన తల్లి తండ్రులను చంపారని  అనుమానం వ్యక్తం చేస్తూ మృతుల కొడుకు కొత్త రవి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వెంటనే ప్రారంభించారు. అయితే విచారణలో ఇంటి అల్లుడే (Son in law) హత్య  (Murder)చేసినట్లుగా తెలిసింది

    తాగుడుకు బానిసై..

    2010లో మంథని మం. చల్లపల్లి గ్రామానికి చెందిన కొత్త సాంబయ్య రెండో కూతురు  వసంతతో నిందితుడు శ్రీనివాస్​కు పెళ్లి అయింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ కొంపల్లి లోని ప్రతాప్ హార్లిక్స్ హెల్త్ అండ్ ఫుడ్ కంపెనీలో హమాలి వర్కర్ గా పనికి చేరాడు శ్రీనివాస్​. అయితే నిందితుడు తాగుడుకు బానిసై ఎలాంటి పనిచేయక పోయేసరికి గత కొంతకాలంగా  వసంతతో గొడవలు జరుగుతుండేవి .

    2 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ గ్రామంలో కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది.  పంచాయితి జరిగిన కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇష్టం వచ్చినట్లు తాగి గొడవలు చేసేవాడు. ఈ విషయమై వసంత తన అమ్మ నాన్న , తమ్ముడుకి ఫోన్ చేసి చెప్పగా  మే 6న  సాంబయ్య కుమారుడైన రవి కొంపల్లి కి వచ్చాడు.

    అత్త మామలు రవిని పంపడం వల్లనే..

    రవి తన అక్క వసంతతో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు ఇచ్చారు . మే 10న డ్యూటీ కి ఎందుకు వెళ్లడం లేదని శ్రీనివాస్​ను అతని భార్య, బావమరిది ప్రశ్నించారు. దీంతో గొడవ జరిగింది. మీ అందరి అంతూ చూస్తానని ఆవేశంగా బయటికి వెళ్లిపోయాడు శ్రీనివాస్​. తన అత్త మామలు (aunt and uncle) రవిని ఇక్కడకు పంపడం వల్లనే ఇదంతా గొడవ జరిగిందని వారిని ఎలా అయిన చంపాలని నిర్ణయించుకున్నాడు అల్లుడు. అదే రోజ రాత్రి సుమారు 10 గం.లకు JBS బస్టాండ్​కు వెళ్లి అక్కడి నుండి కరీంనగర్ కు , కరీంనగర్ నుంచి మంథని బస్ పట్టుకొని రాత్రి సుమారు 4 గం.లకు మంథని మండలం పుట్టపాక స్టేజి దగ్గర దిగి నడుచుకుంటూ తన అత్తగారి ఇల్లు చల్లపల్లి కి వెళ్లాడు.

    పోలీసులు


    అతను వెళ్లే సమయానికి సాంబయ్య ఇంటి ముందు షెడ్డులో కూలర్ వేసుకొని మంచంపై పడుకొని ఉన్నాడు. కూలర్ దగ్గరలో గల ఒక రోకలి బండ తీసుకొని అతని తలమీద గట్టిగా కొట్టాడు అల్లుడు. అతను చనిపోయాడని నిర్ధరించుకొని ఇంటి డోర్ కొట్టగా అత్త లక్ష్మి డోర్ తీసింది , అదే రోకలి బండ తీసుకొని ఆమె తలపై కొట్టగా అక్కడే కింద పడిపోయింది అత్త. తన అత్త దాచుకున్న రూ .20,000 / - లు దొంగలించుకొని రోకలి బండను ఆ ఇంటికి దగ్గరలో గల బావిలో పడేసి పారిపోయాడు అల్లుడు. పోలీసులు విచారణ చేపట్టగా అల్లుడే చంపాడని తేలడంతో అరెస్టు చేశాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Brutally murder, Couple died, Crime news, Son in law

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు