Home /News /telangana /

PEDDAPALLI THE LAKSHMI NARASIMHA TEMPLE IN PEDDAPALLI HAS A HISTORY OF 900 YEARS AND IT IS SAID THAT NARASIMHA TURNED TO STONE THERE FOR PRAHLAD PSE PRV

Temple in Peddapalli: ఆ ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర.. ప్రహ్లాదుడి కోసం అక్కడే శిలగా మారిపోయిన నృసింహుడు.. 

కోరిన కోర్కెలు తీరాక స్వామికి చెల్లించిన ముడుపులు

కోరిన కోర్కెలు తీరాక స్వామికి చెల్లించిన ముడుపులు

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో లక్ష్మీనరసింహ అవతారం ఎంతో విశిష్టమైంది. మనిషి కోరికలు వింతపోకడలు తొక్కినప్పుడు…ఆ ఆదిపురుషుడు దుష్టశిక్షణకు ఎత్తిన అవతారమే నృసింహావతారం. అలాంటి నరసింహ స్వామి దివ్యక్షేత్రాల్లో ఒకటే సుందిళ్ల ఆలయం. ఆ ఆలయ విశిష్టత ఏంటంటే!..!

ఇంకా చదవండి ...
  (E Santhosh, Peddapalli)

  పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామములో ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Lakshmi Narasimha Swamy temple) ఉంది. 11 వ శతాబ్దంలో కాకతీయ రాజులు సైతం ఈ స్వామిని అర్చించి పూజించినట్లు చెప్తుంటారు. నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి.

  ఉగ్రం వీరం మహావిష్ణుం

  జ్వలంతం సర్వతోముఖం

  నృసింహం భీషణం భద్రం

  మృత్యుమృత్యుం నమామ్యహం

  ఈ నృసింహ మంత్రంలో ఉన్న ఒక్కో నామం స్వామి వారి ఒక్కో తత్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రరూపంలో అవతరించిన ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఈ మంత్రాన్ని చదివితే చాలుఆ స్వామి చల్లని కృపను మనపై చూపిస్తాడు. అలాంటిది నిత్యం ఆ స్వామినే తలుస్తూ.ప్రతిక్షణం ఆ స్వామి ద్యాసలోనే ఉండే భక్తుడికి ఆపద వస్తేఆ నృసింహుడు ఊరుకుంటాడా.. భద్రుడిగా మారి తన ఉగ్రరూపం చూపించడు. అలా తన ఉగ్రరూపం చూపించిన ప్రాంతమే ఈ సుందిళ్ల.

  సుందిళ్ల ఆలయ చరిత్ర:

  భూమి మీద అతి కృరమైన రాక్షసజాతికి చెందిన హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు అన్నదమ్ములు. అతి బలవంతుడైన హిరణ్యాక్షుని వధ సోదరుడైన హిరణ్యకశ్యపుని ఎంతో బాధిస్తుంది. ఆ కోపంతో ఆ శ్రీహరిని తుదముట్టించాలని..ఆ శ్రీహరి రక్తంతో తన అన్నకు తర్పణం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

  కానీ, కాలక్రమేణా ఆ హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడు (Prahlad) జన్మిస్తాడు. పుట్టినప్పటి నుంచి ఆ ప్రహ్లాదుడు నారాయణ మంత్రమే జపిస్తుంటాడు. శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు. ఆ శ్రీహరి మీద ఉన్న కోపంతో తన సొంత కొడుకును సైతం సంహరించాలనుకుంటాడు హిరశ్యకశ్యపుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై.. తనను నమ్మి పిలిచిన భక్త ప్రహ్లాదుని కాపాడేందుకు ఆ మహావిష్ణువు ఎత్తిన అవతారమే ఈ నృసింహావతారం.

  భక్త ప్రహ్లాదుని (Prahlad) తండ్రి అయిన హిరణ్య కశ్యపుని లక్ష్మీనరసింహ స్వామి వధించి ఉత్తరాది ముఖముగా వెళ్తుండగా……ఆ స్వామిని ప్రహ్లాదుడు వెనుక నుండి పిలుస్తాడు. దీంతో బాలునికి ఏ ఆపదా వచ్చిందో అని స్వామి వెనక్కి తిరిగి అక్కడ అలాగే దక్షిణ ముఖంగా శిల అయ్యారని ఈ ఆలయ చరిత్ర.

  ఆలయ విశేషాలు:

  900 ఏళ్ల చరిత్ర ఉన్న ఎంతో పురాతన ఆలయంగా (Ancient temple) పేరుగాంచిన ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ నృసింహ స్వామి దక్షిణ ముఖముగా స్వయంభుగా వెలసినందున ఎంతో ప్రాధాన్యతను పొందారు. స్వామి వారు ఇక్కడ యోగానంద స్వరూపుడై ఉన్నారు.

  ఈ ఆలయం కాకతీయుల (kakatiyas) కాలం ముందు నుంచే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయ కట్టడాలను పరిశీలిస్తే.. ఎంతో పురాతన, ప్రాచీన శిల్పకళా ఖండాలు కనిపిస్తాయి. స్వామి వారు ధ్వజత శంకుచక్ర ధారియై ఎంతో ఉగ్రంగా కనిపిస్తారు.  అయితే కొద్ది కాలం అనంతరం.. భక్తుల కోరిక మేరకు శ్రీ లక్ష్మి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుండి ఇక్కడ స్వామివారు లక్ష్మి నరసింహ స్వామిగా ప్రసిద్ధి చెందాడు. స్వామి లక్ష్మీసమేతుడై పూజలు అందుకుంటాడు.

  గోదావరి ఖని ప్రాంతంలోని గోదావరి నదికి ఒక కిలోమీటరు దూరంలోనే ఈ ఆలయం ఉండటం విశేషం. ఇక్కడకు వచ్చే భక్తులు ముందుగా గోదారమ్మ నీటిలో పునీతులై ఒడ్డున ఉన్న గంగమ్మను పూజించి ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకుంటారు.

  పీడ, ప్రాణ భయాన్ని తొలగించే నృసింహుడు:

  ఈ దేవాలయానికి మాసనిక రుగ్మతులతో బాధపడేవారు, భూత, ప్రేత సమస్యలున్నారు..మరే ఇతర దీర్ఘకాలిక అనారోగ్యంతోనైనా ఇబ్బందులు పడుతున్న వారు ఈ స్వామి సన్నిధికి వచ్చి 5 రోజులు లేదా 11 రోజులు నిద్రిస్తే వారి ఆరోగ్య సమస్యల నుంచి భాదల నుంచి విమక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. సుమారు వందల సంఖ్యలో ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్రకు వస్తారు. అలా నిద్రకు వచ్చే వారికి సౌకర్యాలను ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ.

  ఈ ఆలయంలో దీక్షకు పూనుకునే వారికి.. స్వామి వారు కలలోకి వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్తాడట. స్వప్నంలోనే వారి సమస్యలు తీరుతాయని ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం. కోరుకున్న కోరికలు నేరినవారు 108 కొబ్బరికాయలు సమర్పించుకుంటారు. మరికొంతమంది తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు.

  ఈ లక్ష్మీసమేతనృసింహ ఆలయంలో వివాహాలు చేసుకుంటే ఎప్పటికీ కలిసే ఉంటారని..ఆయురారోగ్యాలు, పిల్లాపాపలతో సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను కూడా జరిపిస్తారు.  ఒక పెద్ద పల్లి జిల్లా అని కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ శుభకార్యాలు చేసుకుంటారు.

  స్వామి వారి కళ్యాణ మోత్సవం..

  ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు, ఆ రోజంతా ఇక్కడే ఉండి పూజలు నిర్వహిస్తారు, విశిష్ట రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు మంచిర్యాల,పెద్దపల్లి ఆసిఫాబాద్, మంథని కరీంనగర్ జగిత్యాల వంటి నగరాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

  ఈ ఆలయానికి దగ్గరలో చూడదగినిన మరికొన్ని దేవాలయాలు

  ఈ దేవాలయానికి పశ్చిమాన 50 గజాల దూరంలో కాకతీయుల కాలానికి శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, వంద గజాల దూరంలో అంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి.


  ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?


  ఈ ఆలయానికి చేరుకునేందుకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. బస్సు మార్గం ద్వారా అయితే గోదావరి ఖని వెళ్లి..అక్కడ నుంచి 6km దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక ఆటో, బస్సులలో వెళ్లొచ్చు. రైలు మార్గం ద్వారా అయితే రామగుండం రైల్వేస్టేషన్‌ లో దిగి అక్కడ నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Peddapalli, Temple

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు