( సంతోష్, న్యూస్ 18 తెలుగు, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలలో పేద ప్రజలు పెళ్లిళ్లు జరుపుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా మినీ ఫంక్షన్ హాల్ లు ప్రకటించింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గ్రామ పంచాయతీకికొన్నేళ్లక్రితం కేటాయించిన స్థలం వృధాగా మారింది. మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించగా ఇప్పటికీ స్థలం వృధాగా పడిఉంది. మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు గత ఐదేళ్లక్రితం సర్పంచ్, పాలకవర్గం తీర్మానం చేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. వెంటనే స్పందిన అధికారులు నిధుల మంజూరుకు కృషి నివేదిక ప్రకారం మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 34 లక్షల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఆ స్థలాన్ని చదును చేసి అధికారికంగా జిల్లా మంత్రి రామగుండం ఎమ్మెల్యేలు కలిసి శంకుస్థాపన పూజ నిర్వహించారు. ఇక త్వరలోనే ప్రారంభం కానున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం కొన్ని రోజులకే పరిమితం అయ్యింది. ఎందుకు అంటే శంకుస్థాపన పూజ జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు భూమిలో ఇటుక కూడా పెట్టలేదు. శంకుస్థాపన రాయిని కూడా అక్కడి నుండి పీకేశారు.
ఇక్కడే ఒక చిక్కు పడింది...
భూమి కేటాయించడం, మినీ హాల్ శాంక్షన్ అవడం, నిధులు రావడం, శంకు స్థాపన జరగడం ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలు అయినప్పటికీ, దుఃఖించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ హాల్ కోసం పొలిటికల్ వార్ మొదలైంది. గ్రామస్థుల కోసం వచ్చిన మినీ హాల్ ఒకే కులానికి చెందాలని, దానికి పేరు కూడా ఆ కుల పేరుతో ఉండాలని ఒక వర్గం పట్టుబట్టగా.. లేదు అందరికీ వచ్చింది, అందరికీ ఉండాలని ఒక వర్గం పట్టుబట్టాయి. ఇందులో మెజార్టీ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో పొలిటికల్ ఎంట్రీతో ఆ సమస్య అక్కడికి ఆగిపోయింది. మినీ ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిన నిధులు మంజూరు అయ్యాయా.. కాలేదా.. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది స్పష్టంగా తెలియకుండా అధికారులు కూడా దాటేస్తున్నారు.
ఊరు ముఖ్యమా.. ఓటర్లు ముఖ్యమా?
గ్రామ పంచాయితికి వచ్చిన నిధులు ఓటర్లు ఎక్కువగా ఉన్న కులస్థులకు కేటాయించేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆసక్తి చూపించారు. కానీ గ్రామ సర్పంచ్ ఒప్పుకోలేదు.. దీంతోఇద్దరు మధ్య విభేదాలకు దారి తీసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామ సర్పంచ్ అధికారుల చుట్టూ తిరిగినా.. నాయకులు చూట్టూ తిరిగిన లాభం లేక పోయింది. మినీ ఫంక్షన్ హాల్ స్థలంలో కనీస ఇటుక కూడా పెట్టలేదు. ఆ ఊరు ప్రజల ఆశలు కూడా అవిరయిపోయాయి. ఆయన ఒకే వర్గానికి నాయకుడా.. లేక అందరికీ నాయకుడా?ఒక వర్గ ఓటర్లు ముఖ్యమా?.. గ్రామ అభివృద్ది ముఖ్యమా అని గ్రామా ప్రజలు వాపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana