Home /News /telangana /

PEDDAPALLI THE ACCUSED WHO KILLED HIS WIFE ON SUSPICION SURRENDERED DIRECTLY TO THE POLICE BRV PSE ABH

Peddapalli: జీవితాన్నిచ్చిన మేనమామ అంత పనిచేస్తాడనుకోలేదు.. పాపం క్రాంతి

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, నేరుగా పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, నేరుగా పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

తనని పెంచి పోషించి, చదివించి, తనకు జీవితాన్ని ఇచ్చిన మేనమామ మనసులో అనుమానం అనే పెను భూతం క్షణాల్లో వారి 20 ఏళ్ల ప్రేమకు అంతం పలికింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    E.Santosh, News 18, Peddapalli

    Peddapalli; ఆమె పేరు క్రాంతి తన చిన్న వయసులోనే అమ్మ ప్రేమను, నాన్న ఆప్యాయతను కోల్పోయింది. దీంతో క్రాంతి ఆలన పాలన అన్ని అమ్మమ్మ చూసుకుంది. పెంచి పోషించి ఎంబీఏ వరకు చదివించింది. చదువుకునే సమయం నుండే మేన మామ అశోక్‌ను ప్రేమించింది క్రాంతి. చదువు పూర్తయిన అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై 9 సంవత్సరాలకు వారి ప్రేమకు ప్రతి రూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఎంతో ఆనందంగా, కష్టాలు లేకుండా గడిచింది. ఆ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. క్రాంతి తన భర్త చేతిలోనే హతమయింది. తనని పెంచి పోషించి, చదివించి, తనకు జీవితాన్ని ఇచ్చిన మేనమామ మనసులో అనుమానం అనే పెను భూతం క్షణాల్లో వారి 20 ఏళ్ల ప్రేమకు అంతం పలికింది. పెద్దపల్లి(peddapalli) జిల్లా రణాపూర్ గ్రామానికి చెందిన కొలనూరి క్రాంతి (29) అనే వివాహిత మంగళవారం దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేనమామే క్రాంతిని అతి దారుణంగా హత్య చేశాడు.

    అనంతరం అశోక్ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బసంత్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    అనుమానంతో తరచూ గొడవలు, తట్టుకోలేక భార్య ఆత్మ హత్య:
    కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి(peddapalli) జిల్లా రేగడిమద్దికుంటలో బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి సుల్తానాబాద్(sultanabad) మండలం రాఘవాపూర్‌కు చెందిన అంతగిరి కొమురయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్య(27)ను, సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన మామిడి జలపతికి ఇచ్చి ఎనిమిదేళ్ల కిందట పెళ్లి చేశారు. జలపతి సుల్తానాబాద్‌లో సెల్ ఫోన్ రిపేర్ అండ్ సేల్స్ షాప్ నిర్వహిస్తూన్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తరచూ కుటుంబ కలహాలకు తోడు.. భర్త అనుమానంతో నలిగిపోయేది సంధ్య. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో రెండు వరాల క్రితం జలపతి భార్యపై చేయి చేసుకోవడంతో సంధ్య తన పుట్టింటికి వెళ్లింది. అనంతరం కుటుంబ సభ్యులు సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు చేరింది. కొద్ది రోజులకు మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య... బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    Read this also; Nagarkurnool: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణి.. కానీ, అక్కడ అలా జరుగుతుందని ఊహించనేలేదే..

    సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తలుపు తీసేసరికి తల్లి విగతజీవిగా కనిపించడంతో హతాశులైయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని సుల్తానాబాద్ ప్రభుత్వఆసుపత్రికి తరలించి, జలపతిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు