E.Santosh, News18, Peddapalli
ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేస్తూ కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. సకల సౌకర్యాలతో మెరుగైన విద్యను అందిస్తోంది. ఇందులో భాగంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, పరిషత్ పాఠశాలలను తీర్చిదిద్దుతుంది. కాగా, తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆదర్శ పాఠశాలలలో వచ్చే యేడాదిలో ఉచిత విద్య కొరకై పెద్దపల్లి జిల్లా (Peddapalli District) లోని లింగాపూర్ రామగుండం, అంతర్గామ్ మండలంలో 2023- 2024 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతికి 100 సీట్లకు, ఏడవ నుండి పదవ తరగతిలలో ఏర్పడే ఖాళీ సీట్లకు భర్తీ నిమిత్తం ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీం
ఆసక్తి కలిగిన విద్యార్థులు 15-02-2023 తేదీలోపు http://telanganams.cgg. gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజును జనరల్ విద్యార్థులు 200 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఈడబ్ల్యూ ఎస్ విద్యార్థులు 125 రూపాయలు ఫీజుగా చెల్లించాలని పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీం వెల్లడించారు. 08-04-2023 నుండి హల్ టికెట్లను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చునని తెలిపారు. ప్రవేశ పరీక్ష 16-04-2023 రోజున ఉంటుందని, ఆరవ తరగతి విద్యార్థులు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, ఏడు నుండి పదవ తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2:00 నుండి 4:00 గంటల వరకు విద్యార్థులకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అన్నారు.
అదే విధంగా పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ 15-05-2023, పాఠశాలల వారిగా ఎంపికైన వారి జాబితా ప్రకటన తేదీ: 24-05-2023, సర్టిఫికేట్ వేరిపీకేషన్ 25-05-2023 నుంచి 31-05-2023 వరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించబడిన తేదీ నుండి క్లాసుల నిర్వహణ ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana