హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎన్టీఆర్ ప్రసంగం ఇష్టమన్న తెలంగాణ సీజే.. కారణం ఇదే..!

ఎన్టీఆర్ ప్రసంగం ఇష్టమన్న తెలంగాణ సీజే.. కారణం ఇదే..!

ఎన్టీఆర్ ప్రసంగం గుర్తుచేసుకున్న తెలంగాణ సీజే

ఎన్టీఆర్ ప్రసంగం గుర్తుచేసుకున్న తెలంగాణ సీజే

దేశ భాషల యందు తెలుగు లెస్స అన్నారు అనాడు పెద్దలు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు బాషను, తెలుగులోని మాధుర్యాన్నిఎందరో మహానుభావులు వారి కవితల ద్వారా తెలిపారు. ఎందరో మేధావులు తెలుగు గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు అనాడు పెద్దలు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు బాషను, తెలుగులోని మాధుర్యాన్నిఎందరో మహానుభావులు వారి కవితల ద్వారా తెలిపారు. ఎందరో మేధావులు తెలుగు గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. కాగా, తాజాగా పెద్దపల్లి (Pedapallil) లో నందిమేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభించేందుకు వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలుగు భాషపై తనకు ఉన్న ప్రేమను చాటారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) ప్రసంగం విని, ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆయన హిందీ భాష బాగా మాట్లాడేవారని.. తెలుగు భాషలో ఇంకా ఆకర్షణీయంగా మాట్లాడేవారని చెప్పారు.

కోర్టులలో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చేరువగా న్యాయ వ్యవస్థ పని చేయగలుగుతుందని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు , బోధనకు గల ఆవశ్యకత ప్రాముఖ్యతను వివరించారనిఅన్నారు. క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో స్థానిక భాష ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు, ప్రజలలో నమ్మకం పెరుగుతాయని అన్నారు. భాష కేవలం ఇతరులకు కమ్యూనికేట్ చేసే సాధనం మాత్రమేనని, దీనికి సంబంధించి గౌహతిలో జూనియర్ సెలక్షన్ కమిటీలో జరిగిన సంఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

ఇది చదవండి: 21 ఏళ్లుగా నాటకోత్సవం.. భద్రాద్రి రామయ్య చెంత కళాకారలకు సత్కారం

మంచి పరిజ్ఞానం ఉన్న జడ్జిలను తాను ఎంపిక చేసానని తెలిపారు.ముంబై హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రోసిడింగ్స్ అందజేస్తేఅదనపు లాభాలు కలిగాయని, అదేవిధంగా జిల్లా స్థాయిలో కోర్టులలో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేందుకు అవసరమైన చర్యలు ప్రణాళిక బద్ధంగా తీసుకోవడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇక పెద్దపల్లి జిల్లా చారిత్రాత్మకమైనదని.. నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీనివల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. హైకోర్టు జస్టిస్ పి.నవీన్ రావుపట్ల ఉన్న గౌరవంతో 14 మంది హైకోర్టు జడ్జిలు వచ్చి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించడంతో మరింత శోభ సంతరించుకుందని అన్నారు.పెద్దపల్లి జిల్లా చాలా చారిత్రాత్మకమైన జిల్లా అని, రెండో శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాలు, ఓదెల మల్లికార్జున స్వామి, కమాన్ పూర్ ఆది వరాహస్వామిదేవాలయాలు, రామగిరి ఖిల్లా వంటి ప్రాంతాలు అద్భుతం అని అన్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు