Home /News /telangana /

PEDDAPALLI SULTANABAD POLICE HAVE ARRESTED TWO PERSONS WHO WERE STEALING LORRIES ABH BRV PSE

Peddapalli: ఒక లారీ చోరీపై ఎవరు ఫిర్యాదు చేయలేదని వరుసగా లారీ చోరీలు: చివరకు చిక్కారు

పట్టు పడిన లారీ దొంగలతో సుల్తానాబాద్ పోలీసులు

పట్టు పడిన లారీ దొంగలతో సుల్తానాబాద్ పోలీసులు

ఫైనాన్స్ లో తీసుకున్న సొంత లారీలకు డబ్బులు కట్టేందుకు.. వేరే ప్రాంతంలో లారీలను దొంగిలిస్తూ... ఆ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్న ఇద్దరు లారీ డ్రైవర్లను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh, News 18, Peddapalli)

    ఫైనాన్స్ లో తీసుకున్న సొంత లారీలకు డబ్బులు కట్టేందుకు.. వేరే ప్రాంతంలో లారీలను దొంగిలిస్తూ... ఆ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్న ఇద్దరు లారీ డ్రైవర్లను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణికేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లారీ దొంగిలించబడిందని ఇటీవల వచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

    పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఆదేశాల మేరకు ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్, అశోక్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్ఫర్మేషన్ సిస్టం(information system) మరియు సాంకేతిక పరిజ్ఞానం (information technology) ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈక్రమంలో దొంగతనాలకు పాల్పడుతున్న వాలెపు బాలం, గుంజి జ్వాల అనే ఇద్దరూ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.



    వాలెపు బాలం, గుంజి జ్వాల బావబావమరుదులు. గత పదిహేను సంవత్సరాల నుండి లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు మూడు సంవత్సరాల క్రితం ఫైనాన్స్‌లో(finance) సొంత లారీలను కొనుగోలు చేశారు. వాలెపు బాలంరెండు లారీలను, గుంజి జ్వాల ఒక లారీని నడిపిస్తున్నారు. లారీ ఫైనాన్స్ డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఒత్తిడికి గురిచేశారు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని లారీలనే దొంగతనం చేసి అమ్ముకోవాలని పధకం వేశారు. వారు పని చేస్తున్న ప్రదేశంలో లారీలు దొంగిలిస్తే అందరికి తెలిసిపోతుందని... ఇతర ప్రాంతాల్లో లారీలను దొంగిలించాలని నిర్ణయించుకున్నారు.

    ఈక్రమంలో వాలెపు బాలం తన లారీ (నెంబర్ AP 16 TS 4669)లో ఆగష్టు 8న కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సిబిపేట్ ఏలూరు నుండి కోళ్ల దాణా లోడు తీసుకొని ముక్దంపూర్ తీసుకువచ్చి అక్కడ అన్లోడ్ చేశాడు.మరల లోడు కోసం పెద్దపెల్లి లారీ ఆఫీసుకు ఫోన్ చేయగా వారు సాయంత్రం వరకు లోడు లేదని తెలపడంతోలారీను కాట్నాపల్లి రైస్ మిల్ అసోసియేషన్ ఎదుట ఉన్న వినాయక కాంటా వద్ద నిలిపి ఉంచారు. వీరు ఆగి ఉన్న ప్రాంతంలో మరొక లారీ పార్క్ చేసి ఉండగా... ఆ లారీకి సంబంధించి రాత్రి వరకు ఎవరూ రాలేదు.

    దీంతో అర్ధరాత్రి2 గంటల సమయంలో వాలెపు బాలం లారీని తీసుకుని కరీంనగర్ రోడ్డులో ఉన్న గుంజి జ్వాలకు అప్పగించాడు. అనంతరం గుంజి జ్వాల ఆ లారీని ఖమ్మం తీసుకెళ్లాడు. ఈక్రమంలో వాలెపు బాలం తన లారీతో ఖమ్మం చేరుకోగా... ఇరువురు కలిసి దొంగలించిన లారీని గుంటూరుకు తీసుకువెళ్లి అక్కడ ఫిరోజ్ అనే వ్యక్తికి అమ్మారు.

    రూ. 3 లక్షలకు బేరం కుదరగా ఫిరోజ్వీరికి రూ. 50వేలు అప్పజెప్పాడు. గతంలో కూడా నిందితులు రెండు లారీలను ఫిరోజ్‌కు అమ్మినట్లు విచారణలో తేలింది. వచ్చిన డబ్బులతో ఆ ఇద్దరు నిందితులు జల్సాలు చేస్తూ, అప్పులు తీర్చుకునేవారని పోలీసులు తెలిపారు. ఒకసారి దొంగిలించిన లారీ గురించి ఎవరు అడగకపోవడంతో మరొక లారీ దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే మరో లారీని దొంగిలించేందుకు కరీంనగర్ వచ్చిన నిందితులను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి ఒక లారీ, సెల్ ఫోన్, రూ. 3000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

    Read This; Peddapalli: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు