Home /News /telangana /

PEDDAPALLI STUDENTS SHOULD DEVELOP AWARENESS ABOUT CYBER CRIMES ABH BRV PSE

Peddapalli: 'సైబర్ కాంగ్రెస్'తో సైబర్ నేరగాళ్ల మోసాలకు చెక్: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ 

సైబర్ కాంగ్రెస్ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న డీసీపీ మహాజన్

సైబర్ కాంగ్రెస్ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న డీసీపీ మహాజన్

టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాలను గుర్తించి స్నేహితులను, బంధువులను, ఇరుగుపొరుగు వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని రామగుండం డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh, News 18, Peddapalli)

    టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాలను గుర్తించి స్నేహితులను, బంధువులను, ఇరుగుపొరుగు వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని రామగుండం డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా... అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు 'సైబర్ కాంగ్రెస్ (Cyber Congress) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ. ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ, పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసందర్భంగా ఆగష్టు 11న రామగుండంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ భారతి హోలికేరి, డీసీపీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.



    ఈసందర్భంగా డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని... విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తున్నట్లు తెలిపారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా తల్లిదండ్రులు, మహిళలు, యువతకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించనుంది. సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన కలిగిఉండాలని డీసీపీ అన్నారు.

    ప్రతి ఒక్క విద్యార్థి సైబర్ కాంగ్రెస్ పై అవగాహన పెంచుకొని ఉత్తమ సైబర్ అంబాసిడర్లుగా మారాలని డీసీపీ సూచించారు. సెల్‌ఫోన్లు, అంతర్జాలం, ఆన్‌లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుందని ముఖ్యంగా మహిళలు, పిల్లలే టార్గెట్‌గా సైబర్ నేరాలు, వేధింపులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా పోలీసుశాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ సైబర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, అంతర్జాలం వేదికగా జరిగే ఈ సైబర్ మోసాలపై ప్రతిఒక్కరు అప్రమత్తతో వ్యవహరించి జాగ్రత్త వహించాలని డీసీపీ తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ సైబర్ అంబాసిడర్లుగా పలువురు విద్యార్థినీవిద్యార్థులను జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు.

    Read This; Peddapalli: రక్షాబంధన్ ఆనందాలు తీరకుండానే అన్న అనంతలోకాలకు: గుండెలవిసేలా రోదించిన చెల్లి
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు