రామగుండంలో పారా గ్లైడింగ్... యువకుడి అద్భుత ఆవిష్కరణ

అర్జున్ కూడా పవర్ పార గ్లైడర్ రూపొందించాలని మూడేళ్లుగా ప్రయత్నం చేసి అమెరికా, ఇటలీ నుండి పదిహేను లక్షల విలువైన పరికరాలను తెప్పించాడు. వాటితో తానే స్వయంగా పారా గ్లైడర్‌ను తయారు చేశాడు.

news18-telugu
Updated: September 23, 2020, 4:19 PM IST
రామగుండంలో పారా గ్లైడింగ్... యువకుడి అద్భుత ఆవిష్కరణ
రామగుండంలో పారా గ్లైడింగ్... యువకుడి అద్భుత ఆవిష్కరణ
  • Share this:
పారా గ్లైడింగ్.. ! పర్యాటకులకు ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. భూమికి వందల మీటర్ల ఎత్తులో పక్షిలా విహరిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇలాంటివి గేమ్స్ ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల్లోనే కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ రాష్ట్రాల్లో పారా గ్లైడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సాహస క్రీడను ఎంజాయ్ చేయాలన్న కోరిక అందరిలోనూ ఉన్నప్పటికీ.. ఆ సదుపాయం మన దగ్గర ఎక్కువగా ఉండదు. అలాంటి పారా గ్లైడర్‌ను ఓ తెలంగాణ యువకుడు తయారు చేశాడు. తన మేధోశక్తితో పవర్ పారా మోటర్ గ్లైడింగ్ యంత్రాన్ని ఆవిష్కరించి శభాష్ అనిపించాడు. దాన్ని విజయంతంగా గాల్లోకి తీసుకెళ్లి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఆడెపు అర్జున్ బీకాం పూర్తి చేశాడు. అతడి తండ్రి వెంకటేశ్శర్లు విశ్రాంతి సింగరేణి కార్మికుడు. కుటుంబంలో చిన్నవాడైన అర్జున్.. సాహస క్రీడలు, ఇతర విన్యాసాలపై మక్కువ చూపేవాడు. గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్టంలో తన స్నేహితులతో కలిసి విన్యాసాలలో నైపుణ్యం పెంచుకున్నాడు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు పైలెట్, క్రీడాకారులు, పార గ్లైడర్‌లు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తను కూడా చేరి ఎప్పటికప్పుడు పవర్ గ్లైడర్‌పై సమాచారం తెలుసుకునేవాడు. అర్జున్ కూడా పవర్ పార గ్లైడర్ రూపొందించాలని మూడేళ్లుగా ప్రయత్నం చేసి అమెరికా, ఇటలీ నుండి పదిహేను లక్షల విలువైన పరికరాలను తెప్పించాడు. వాటితో తానే స్వయంగా పారా గ్లైడర్‌ను తయారు చేశాడు.


సోమవారం రామగుండం జెన్కో ఏకో క్రీడా మైదానంలో 20 నిమిషాల పాటు ట్రైలర్ రన్ నిర్వహించి అందరినీ అబ్బుర పరిచాడు. గాల్లో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నాడు. పవర్ పారా గ్లైడర్ గాల్లో ఎగురుతుంటే స్థానికులు కేరింతలు కొట్టారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్ అడ్వెంచర్ కోసం ఇతర రాష్ట్రాల నుండి పారాగ్లైడర్లను పిలిపించి విన్యాసాలు చేస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని అర్జున్ కోరుతున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. పారా గ్లైడర్ తయారుచేసిన అర్జున్ ప్రతిభ‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 23, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading