హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: రామగుండంలోని ఆ ప్రాంతంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు: ఒక్కసారిగా స్థానికుల్లో టెన్షన్

Peddapalli: రామగుండంలోని ఆ ప్రాంతంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు: ఒక్కసారిగా స్థానికుల్లో టెన్షన్

రామగుండం

రామగుండం

డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది రామగుండంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళ పోలీసులు, 70 మంది సిబ్బందితో ఆకస్మికంగా సోదా చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  (E. Santosh, News18, Peddapalli)

  రామగుండం పోలీస్ కమిషనర్ (Ramagundam Police Commissioner) ఆదేశాల మేరకు మంచిర్యాల (Mancherial) జోన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగమల్లయ్యపల్లిలో ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan), మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళా పోలీసులు, 70 మంది సిబ్బందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్  కార్యక్రమం (Community Contact Program) నిర్వహించి ఇళ్లను, చుట్టూ ప్రక్కల ప్రాంతాలను సోదా చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి డీసీపీ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాలనీ పరిధిలో పలు వాహన పత్రాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సిజ్ చేశారు. 120 టూ వీలర్స్, 01-కారు, 01-ఆటో, 01-ట్రాలీని సీజ్ చేశారు.

  నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని కాలనీ పరిధిలో షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీశారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

  Open Drinking: బహిరంగంగా మద్యం సేవించిన వ్యక్తులపై పోలీసుల కొరడా.. కఠిన చర్యలకు రంగం

  మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు పోలీసులు. మహిళలు, యువతులు, చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మహిళ పట్ల, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అని తెలిపారు.

  NTPC పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్..

  గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ (NTPC) పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి శివారు, పీకే రామయ్య కాలనీ, ఇందిరానగర్ శివారు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు పోలీసులు. వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత వ్యక్తుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ నివాసం ఉంటున్నారని వివరాలను సేకరించారు.

  Rajanna Sircilla: ఆ గ్రామ సర్పంచ్​ భర్త చేసిన ఓ తప్పుకు.. ఊరంతా ఒకరోజు చీకట్లో బతకాల్సి వచ్చింది.. ఏం జరిగిందంటే?

  సరైన వివరాలు చెప్పకుండా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను విచారించారు. ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా వేలిముద్రలు సేకరించారు, మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mancherial, Peddapalli, Police, Ramagundam

  ఉత్తమ కథలు