హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: అయ్యప్ప మాలలో అల్లుడి ఘాతుకం .. అత్త అంతు చూసిన వైనం

OMG: అయ్యప్ప మాలలో అల్లుడి ఘాతుకం .. అత్త అంతు చూసిన వైనం

peddapalli murder

peddapalli murder

OMG: అయ్యప్ప మాల వేసిన ఓ వక్తి మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కూతురు కోసం వచ్చిన అత్తపై కిరాతకానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే..

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(P.Srinivas,New18,Karimnagar)

అయ్యప్ప మాల(Ayyappa initiation) వేసిన ప్రతీ ఒక్కరు ఎంతో భక్తి శ్రద్దలతో ఆ దేవుడిని కొలుస్తుంటారు. రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి దేవుడికి పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటుంటారు. ఇలా ఎంతో భక్తితో ఉండే ఈ స్వాములు కుటుంబానికి దూరంగా ఉంటూ భక్తి శ్రద్దలతో ఉంటారు. అచ్చం ఇలాగే అయ్యప్ప మాల వేసిన ఓ వక్తి మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కూతురు కోసం వచ్చిన అత్తపై అల్లుడు కిరాతకానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి(Peddapally) జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

OMG: మత్తెక్కించే చాక్లెట్లు .. కేవలం అక్కడ మాత్రమే లభించును

అత్త అంతు చూసిన అల్లుడు..

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని కృష్ణానగర్ పకు చెందిన సతీష్, పద్మ దంపతులు వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త సతీష్ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. అలా పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం సాఫీగానే కొనసాగింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరో చోట నివాసం ఉంటున్నాడు.

మనస్పర్ధలే కారణం ..

ఇక ఈ క్రమంలోనే సతీష్ అయ్యప్ప మాల వేసినట్లుగా తెలుస్తోంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త వేరుగా ఉండడంతో పద్మ తట్టుకోలేకపోయింది.ఈ క్రమంలోనే ఇటీవల పద్మ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇక సాయంత్రం అయినా పద్మ ఇంటికి రాకపోవడంతో కూతురు తన తండ్రికి సమాచారాన్ని చేరవేసింది. దీంతో వెంటనే భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ క్రమంలోనే పద్మ తల్లిదండ్రులు అల్లుడు సతీష్ ఇంటికి వెళ్లారు. నా కూతురు ఎక్కడికి వెళ్లింది? నీ వల్లే ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని అత్త కోపంతో అల్లుడిపై అరిచింది. ఇక తట్టుకోలేకపోయిన అల్లుడు సతీష్ కోపంతో ఊగిపోయి నెలేకేసి అత్తను బాదాడు.

Friendship: చనిపోయిన ఫ్రెండ్ కోసం ఆ స్నేహితులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

మాలలో ఉండే మర్డర్ ..

అయ్యప్ప మాలాధారణలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి అత్తపై దాడికి పాల్పడ్డాడు. అల్లుడి దాడిలో అత్త అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ మహిళ చివరికి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఆ మహిళ కుటుంబ సభ్యులు సతీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

First published:

Tags: Murder, Peddapalli, Telangana crime news

ఉత్తమ కథలు