హోమ్ /వార్తలు /తెలంగాణ /

సింగరేణి సిగలో మరో అందం.. ఆహ్లాదాన్నిస్తున్న పార్క్

సింగరేణి సిగలో మరో అందం.. ఆహ్లాదాన్నిస్తున్న పార్క్

X
గోదావరి

గోదావరి ఖనిలో ఆకట్టుకుంటున్న సింగరేణి పార్క్

ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంలా ప్రకృతి సోయగాలను పంచుతుంది ఈ పార్కు. చుట్టూ పచ్చదనం, దట్టమైన చెట్ల పొదలు, ఉద్యాన వనాలు, గుబాళిస్తున్న పూల మొక్కలతో ఉద్యానవనంలా ఉన్న ఈ పార్కు పర్యావరణ ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంలా ప్రకృతి సోయగాలను పంచుతుంది ఈ పార్కు. చుట్టూ పచ్చదనం, దట్టమైన చెట్ల పొదలు, ఉద్యాన వనాలు, గుబాళిస్తున్న పూల మొక్కలతో ఉద్యానవనంలా ఉన్న ఈ పార్కు పర్యావరణ ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ పార్కును సింగరేణి (Singareni Calaries Limited) యాజమాన్యం నిర్మించింది. ఈ పార్కు విశాలంగా ఆహ్లాదంగా ఉండటంతో ప్రకృతిప్రియులను ఆకర్శిస్తుంది. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలోని డా.బీఆర్ అంబేద్కర్ పార్క్ ఎంతో ప్రకృతి ప్రియులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఉరుకులు పరుగుల ఆధునిక జీవనంలో ఇటు వంటి పార్కులు ఎంతో మానసిక ఉల్లాసాన్నిస్తున్నాయి. ఇక్కడి సింగరేణి కార్మికులు, రిటైర్డ్ అయిన కార్మికులు చుట్టూ పక్క పరిసరాల ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కాసేపు సేద తీరిపోతున్నారు.

ఓసీపీ 5 వలన పెరుగుతున్న పొల్యూషన్‌ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు ఈ పార్కు ఎంతో ఉపశమనాన్నిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, గడ్డి, పూలచెట్లతో నందనవనంగా కనిపిస్తుంది. ఈ పార్కులో వృక్షాలు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఇందులో ఎన్నో వేపచెట్లు ఉన్నాయి. పూల మొక్కలు వందల సంఖ్యలో పెంచుతున్నారు.

ఇది చదవండి: బ్రాండెడ్ కంపెనీల ఆఫర్లు.. జనరిక్ మందుల జాడేది..?

ఈ పార్కులో ప్రత్యేకతలు..!

ఈ పార్కులో ఆహ్లాదంతో పాటు ఇక్కడికి సేద తీరేందుకు వచ్చే వారికి ప్రత్యేకంగా కూర్చోడానికి బెంచీలను ఏర్పాటు చేశారు. వాటర్ ఫౌంటెన్ ఇక్కడికి వచ్చిన పర్యాటకులను ఆకర్షిస్తుంది. వాకింగ్ కి వచ్చే వారి కోసం చుట్టూ వాక్ వే ఏర్పాటు చేశారు. బాడీ ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట పరికరాలను ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆడుతూ ఆనందంలో మునిగిపోతున్నారు.

ఈ పార్క్ లో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, వయసుపై బడిన వారు ప్రతి రోజూ వచ్చి ఇక్కడ సుమారు 2 గంటల పాటు సమయాన్ని కేటాయిస్తారు. పచ్చటి వాతావరణంలో ఇలా కూర్చొని కాసేపు సార్ధక బాధలు పంచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పార్కుకు వచ్చిన గౌతం లక్ష్మినారాయణ అనే వ్యక్తి చెప్పారు.

First published:

Tags: Local News, PEDDAPALLI DISTRICT, Singareni Collieries Company, Telangana

ఉత్తమ కథలు