Home /News /telangana /

PEDDAPALLI SINGARENI EMPLOYEE COMMITTED SUICIDE DUE TO HARASSMENT BY LOAN APP MANAGERS IN PEDDAPALLY DISTRICT SNR KNR

Telangana : యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్‌ .. ఆ విధంగా టార్చర్‌ పెట్టడం భరించలేకే

( loan app victim )

( loan app victim )

Peddapally: చక్కగా ఉద్యోగం చేసుకునే యువకుడి ప్రాణాలు తీసింది లోన్‌ యాప్. క్రికెట్‌ బెట్టింగ్ మోజులో అప్పుగా డబ్బుగా తీసుకుంటే ..లోన్ యాప్ నిర్వాహకులు అతడి పరువు బజారుకీడ్చారు. మానసికంగా వేధించారు. అవన్ని భరించలేక బలవన్మరణం చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    అప్పు ఆ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. తల్లిదండ్రులు, మంచి ఉద్యోగం, ఎంతో భవిష్యత్తు ఉంచుకొని కేవలం క్రికెట్‌ బెట్టింగ్‌(Cricket Betting)లో డబ్బులు పోవడం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌ లోన్ యాప్‌(Online loan app)లో రుణం తీసుకున్న పాపానికి నిర్వహకులు పెట్టిన టార్చర్‌ (Torture) భరించలేకపోయాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంత జరిగినా లోన్‌ యాప్ నిర్వహకుల తీరు మాత్రం మారడం లేదు. కుటుంబ సభ్యులను అప్పు తీర్చమని వేధిస్తున్నారు.

    ప్రాణం తీసిన అప్పు..
    పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలో నివాసముంటున్న ప్రశాంత్ సింగరేణి సంస్థలో జాబ్‌ చేస్తున్నాడు. మైనింగ్ కోర్స్‌ చేసి ఐదేళ్ల క్రితం జాబ్‌లో చేరాడు. ఓవర్‌మెన్‌గా చేస్తూనే ..రీసెంట్‌గా అండర్‌ మేనేజర్ పోస్ట్‌కి అర్హత పొందాడు. తండ్రి రాజన్న, తల్లి మల్లీశ్వరి, సోదరుడు ఉన్నారు. ప్రశాంత్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో కొంత డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును కవర్‌ చేసుకునేందుకు మనీ వ్యూ యాప్‌ ద్వారా 60వేలు అప్పు తీసుకున్నాడు. అంతే అదే అతను చేసిన పెద్ద పొరపాటు. తీసుకున్న రుణం టైమ్‌కి చెల్లించలేదు ప్రశాంత్. దాంతో మనీ యాప్ నిర్వహకులు ఫోన్‌లు చేస్తూ బూతులు తిట్టడం మొదలు పెట్టారు. మనీ యాప్ నిర్వహకుల ఆగడాలు మరీ శృతిమించిపోయాయి. ప్రశాంత్‌తో వేరే అమ్మాయి నగ్నంగా ఉన్న ఫోటోలను కూడా క్రియేట్ చేశారు. ప్రశాంత్‌ కాంటాక్ట్‌లో ఉన్న బంధువులు, తల్లిదండ్రులకు షేర్ చేశారు. చివరకు ప్రశాంత్‌ తల్లి వాట్సాప్‌ నెంబర్‌కు పంపి అతడు మానసికంగా బాధపడేలా చేశారు. మనీ యాప్ ఆగడాలు భరించలేకపోయిన ప్రశాంత్ ఈనెల 7వ తేది ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. సోదరుడు కనిపించకపోవడంతో ప్రశాంత్ తమ్ముడు అదే రోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు.



    వేధింపులు భరించలేక..
    7వ తేది నాడు ఇంట్లో చెప్పకుండా వెళ్లి ప్రశాంత్ రెండ్రోజుల తర్వాత రాఘవపూర్ దగ్గర కేరళ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకును పోగొట్టుకొని పుట్టెడు బాధలో తల్లిదండ్రులు ఉంటే లోన్‌ యాప్‌ నిర్వాహకులు మాత్రం మరింత బరితెగించారు. వాట్సాప్‌ డీపీలోని తల్లిదండ్రుల ఫోటోలను తీసి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. తమ బిడ్డ లేడని ప్రాణాలు తీసుకున్నాడని చెబుతున్నా వినిపించుకోకుండా చనిపోతే మాకేంటి డబ్బులు కట్టాల్సిందేనంటూ టార్చర్‌ పెడుతున్నారని ప్రశాంత్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

    Telangana : నలుగురు ఉన్న ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిగల్లేదు .. ఆ అజాగ్రత్తే కొంపముంచిందా



    లోన్‌ నిర్వాహకులే అరాచకులు..
    లోన్‌ యాప్ నిర్వాహకుల రాక్షసత్వాన్ని భరించలేకపోతున్న ప్రశాంత్ తల్లిదండ్రులు లోన్ యాప్ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా సింగరేణి కార్మికుడు ఒకరు లోన్ తీసుకుంటే వేధింపులకు గురి చేయడం వల్లే ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఘటన పూర్తిగా మర్చిపోక ముందే మరొ యువకుడు ప్రాణాలు తీసుకోవడం చూసి స్థానికులు బాధాకరమంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవొద్దని సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Loan apps, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు