హోమ్ /వార్తలు /తెలంగాణ /

పుచ్చు పళ్ళు రాకుండా అతి సులువైన జాగ్రత్తలివే!..

పుచ్చు పళ్ళు రాకుండా అతి సులువైన జాగ్రత్తలివే!..

X
దంత

దంత క్షయానికి కారణాలు తెలియజేస్తున్న వైద్యులు

Telangana: పంటి నొప్పి వస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది. ఏదైనా తినాలన్నా, ఏదైనా తాగాలన్నా జివ్వుమని లాగుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తలువహించాల్సినవి ఇవే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santosh, News18, Peddapalli)

పంటి నొప్పి వస్తే ప్రాణం పోయినంత పని అవుతుంది. ఏదైనా తినాలన్నా, ఏదైనా తాగాలన్నా జివ్వుమని లాగుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తలువహించాల్సినవి ఇవే. సాధారణంగా పుచ్చు.. పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరని తయారు చేసి ఈ పొర పంటి మీద ఎనామిల్ లోంచి మినరల్స్ ని తీసేసినెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది. అయితే, విటమిన్ డీ వల్ల ఆహారంలో ఉన్న కాల్షియం, ఫాస్ఫేట్ శరీరంలో అబ్జర్వేషన్ చేసుకుంటుంది. విటమిన్ డి తో పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ 10 నిమిషాల పాటు పొద్దున ఎండలోసమయాన్ని కేటాయించాలి.

ఒక వేళ సమస్య తీవ్రంగా ఉందనుకుంటే ఆ పన్నుని తీసేసి పక్క పంటికి సమస్య పాకకుండా చేస్తారు. రోజంతా షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం, రోజుకి రెండు సార్లు సరిగ్గా బ్రష్ చేసుకోవడం ఈ రెండు పద్ధతుల వల్లా ఈ సమస్య రాకుండా ఎనభై శాతం వరకూ నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. రోజంతా ఏదో ఒక పద్ధతిలో షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే కష్టం. ఒక సారి నోట్లోంచి షుగర్ లోపలికి వెళ్ళిపోయాక కొంత సేపటికి ఎనామిల్ మళ్ళి మినరల్స్ ని తయారు చేసుకుంటుంది.

కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇరవై నిమిషాల పాటు నోరంతా తిప్పుతూ ఉండడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. నువ్వుల నూనెతో ఇలా చేస్తే ప్లేక్, జింజవైటిస్, బాక్టీరియా అన్నీ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. లికోరిస్ రూట్ లో ఉండే గుణాలు దంత క్షయం కలిగించే బాక్టీరియాతో సమర్ధవంతంగా పోరాడగలవని నిపుణులు చెబుతున్నారు. కావిటీస్ మనకు తెలియకుండానే ఏర్పడి పెరుగుతాయి. రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి, ఫ్లోరీడ్ ట్రీట్మెంట్స్, ఫిల్లింగ్స్, రూట్ కెనాల్, కాప్ వెయ్యడం లాంటి పద్ధతుల ద్వారా ఈ సమస్యని పూర్తిగా నివారించడం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.

First published:

Tags: Health Tips, Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు