హోమ్ /వార్తలు /తెలంగాణ /

వంట చేయడంలో వినూత్న ఐడియా.. అందుకే సక్సెస్ అయ్యాడు..! లాభాలు సూపర్

వంట చేయడంలో వినూత్న ఐడియా.. అందుకే సక్సెస్ అయ్యాడు..! లాభాలు సూపర్

X
వంట

వంట వ్యాపారంలో రాణిస్తున్న పెద్దపల్లి వాసి

ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా..! అచ్చం అలాగే మారింది పెద్దపల్లి జిల్లా (Peddapalli District) కు చెందిన శంకరయ్య జీవితం. ఉద్యోగం పోయినా ఉసూరుమంటూ కూర్చోకుంటా చేతికి వచ్చిన, తనకు నచ్చిన పనిని నమ్ముకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా..! అచ్చం అలాగే మారింది పెద్దపల్లి జిల్లా (Peddapalli District) కు చెందిన శంకరయ్య జీవితం. ఉద్యోగం పోయినా ఉసూరుమంటూ కూర్చోకుంటా చేతికి వచ్చిన, తనకు నచ్చిన పనిని నమ్ముకున్నాడు. వినూత్న ఆడియాతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్కలపల్లికి చెందిన శంకరయ్య.. ఎఫ్.సీ.ఐ కర్మాగారంలో పనిచేశాడు. ఐతే పరిశ్రమ మూతపడటంతో ఉపాధి కోల్పోయాడు. ఏం చేయాలో అర్ధం కాక చాలా రోజులు ఇబ్బందిపడ్డాడు. ఐతే వంటలు చేయడమంటే శంకరయ్యకు ఇష్టం. ఇష్టాన్నే ఉపాధిగా మార్చుకోవాలనుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగి ఇంటివద్దే వంటలు చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. తొలుత కిలో, రెండు కిలోలల నాన్ వెజ్ వంటకాలు చేసి కస్టమర్లకు ఇచ్చేవాడు. టేస్ట్ నచ్చడంతో స్థానికులంతా శంకరయ్యతో వంట చేయించుకునేవారు.

అప్పట్లో కిలో చికెన వండిస్తే రూ.30 రూపాయలు తీసుకునేవాడు. దీంతో సిట్టింగ్ వేయాలనుకునే యువకులు, ఇతరులు శంకరయ్యతో నాన్ వెజ్ వండించుకొని తీసుకెళ్లేవారు. అలా నెమ్మదిగా వ్యాపారాన్ని పెంచుకుంటూ హోటల్ ప్రారంభించాడు. ప్రస్తుతం కిలో చికెన్ వండి ఇవ్వడానికి రూ.120 తీసుకుంటున్నాడు. అలాగే ఇత వంటకాలు కూడా చక్కగా శుభ్రంగా చేసి ఇవ్వడంతో చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు శంకరన్న హోటల్ అంటే తెలియనివారుండరు.

ఇది చదవండి: పులితో సెల్ఫీ కావాలా..? సఫారీతో లక్కీ ఛాన్స్.. ఖర్చు ఎంతంటే..!

ఎలుకలపల్లి దాటిన తరువాత రానపురం, నాగారం, రొంపికుంట, గుంటూరు పల్లిలో వంటి గ్రామాల్లో తాటికల్లు, ఈత కల్లు అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో కల్లు తాగేందుకు వెళ్లావాళ్లంతా శంకరయ్య దగ్గరకు వచ్చి చికెన్, మటన్ వంటివి వండించుకొని తీసుకెళ్తుంటారు.

ఇది చదవండి: ఈ గుడిలో ముడుపు కడితే భూ సమస్యలు పరిష్కారం అవుతాయట..!

నాణ్యతతో కూడిన వంటలు..

బయట వండిన ఆహారం ఎలాంటి పరిసరాలల్లో వండుతారో తెలియదు. పైగా ఆ ఆహారం వల్ల అప్పటికప్పుడు ఆకలి తీరినా మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవని అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు నాణ్యత కలిగిన వంట సామగ్రి వాడుతారు. ఒక్కసారి శంకరన్న వంట తింటే అమ్మ చేతి వంట తిన్న ఫీలింగ్ లో ఉండిపోతుందని కస్టమర్లు చెప్పేమాట. అందుకే శంకర్ హోటల్ చుట్టు పక్కల గ్రామాలలో అంతగా ఆదరణ పొందింది.

డిప్లమో చదివిన శంకర్ కొడుకు కూడా ఉద్యోగానికి వెళ్లకుండా.. మరో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అక్కడ కూడా మంచి ఆదరణపొందడంతో బిజినెస్ సక్సెస్ అయింది. శంకర్ హోటల్ లో తయారు చేసే చికెన్, మటన్, చేపలు, బిర్యానీ, చపాతి ఆర్డర్ పై తయారు చేసి ఇస్తారు. ఈ హోటల్ ద్వారా శంకరన్న ఉపాధి పొందడమే కాకుండా మరో రెండు కుటుంబాలకు ఉపాధి అందిస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు