Home /News /telangana /

PEDDAPALLI SC HOSTEL IN RAMAGUNDAM PEDDAPALLI DISTRICT WHICH IS IN DILAPIDATED CONDITION SNR PSE BRV

Peddapalli: సౌకర్యాల్లేక మూతపడ్డ సంక్షేమ హాస్టళ్లు .. తెరిచే అవకాశం ఏమైనా ఉందా !

(శిథిలావస్థలో

(శిథిలావస్థలో హాస్టల్)

Peddapalli: కేజీ టు పీజీ ఉచిత విద్య అని గొప్పలు చెప్పిన తెలంగాణ సర్కారు ఇప్పుడు కనీసం ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకోవాలనుకునే విద్యార్ధుల పట్ల సర్కారు మరింత చిన్నచూపు చూస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎస్సీ హాస్టల్ పరిస్థితి చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనే సమాధానం వస్తుంది.

ఇంకా చదవండి ...
    (santosh,News18,Peddapalli)
    పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలంటూ ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి కల్పిస్తుంటే..అధికారులు మాత్రం ఆ హాస్టల్ నిర్వహణపై బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ(Telangana) విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్ (Hostels)లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 13వ(13Th june) తేదీన పాఠశాలలు(Schools) పునఃప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో విస్తృతంగా \"బడిబాట\" కార్యక్రమం చేపడుతున్నారు ఉపాధ్యాయులు. ఊరూరా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ హాస్టల్స్ లో కనీస వసతులు కూడా లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గల ఎస్సీ హాస్టల్ ఇక మూతపడినట్లే అన్నట్టుగా పరిస్థితి తయారైంది.

    కరోనా టైమ్‌లో మూతపడింది ఇప్పటికీ :
    పెద్దపల్లి జిల్లా రామగుండం మండల కేంద్రంలోని \"జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఎస్సి విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా గత మూడేళ్ళుగా హాస్టల్ మూసివేశారు అధికారులు. కరోనా ప్రభావం కాస్త తగ్గిన అనంతరం గతేడాది పాక్షికంగా పాఠశాలలు తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే హాస్టల్స్ మాత్రం తెరుచ్చుకోలేదు. ఈక్రమంలో రామగుండంలో మూతపడిన ఎస్సి హాస్టల్, గత మూడేళ్ళుగా తిరిగి ప్రారంభానికి నోచుకోలేదు. జూన్ 13 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం అయినా, ప్రభుత్వ హాస్టల్స్ తెరవడంలో మాత్రం అధికారులు జాప్యం వహించారు. ప్రతి ఏటా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో సుమారు 150 మంది విద్యార్థులు హాస్టల్ అడ్మిషన్ తీసుకునే వారు. అయితే హాస్టల్‌లో వసతుల లేమి, పట్టించుకునే వారు లేక అడ్మిషన్ తీసుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తూ ప్రస్తుతానికి మొత్తానికే తాళం పడింది.



    పట్టించుకోని స్థానిక అధికారులు:
    రామగుండం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఎస్సి హాస్టల్‌కు చుట్టూ ప్రక్కల గ్రామాలు, చిన్న పట్టణాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చేవారని పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణ చెప్తున్నారు. \"ఇప్పటికీ మూడేళ్లు కావస్తుంది, హాస్టల్ గేట్లకు తాళం వేసి. ప్రతి సంవత్సరం సుమారు 150 మంది విద్యార్థులు ఈ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ స్కూల్ లో చదువుకునే వారు. కానీ ఈసారి మాత్రం ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. కారణం హాస్టల్ అభివృద్ధికి నోచుకోక పోవడమే\" అని రామగుండం జిల్లా పరిషత్ ప్రిన్సిపల్ స్వర్ణ \"న్యూస్ 18\" ప్రతినిధితో అన్నారు.

    ఇది చదవండి: కరీంనగర్ జిల్లాలో క్రిమినల్ రికార్డ్స్‌లోకెక్కిన కార్పొరేటర్స్ ..ఎంత మందో తెలుసా



    విద్యార్థులు చేరకపోవడానికి కారణం?:
    రామగుండంలోని ఎస్సీ హాస్టల్ ఒకప్పుడు విద్యార్థులతో కలకలలాడేది. కరోనాకు ముందు వరకూ హాస్టల్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు అలాగే కొనసాగారు. కానీ రోజురోజుకి పరిస్థితి దిగజారింది. హాస్టల్ కు తాళం పడింది. హాస్టల్ ఆవరణంలో పిచ్చిమొక్కలు మొలిచాయి. హాస్టల్ గదులు కనీసం కూర్చునేందుకు కూడా ఉపయోగంలో లేవు. దీనంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం. సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ హాస్టల్ పై దృష్టి సారించలేక పోయారు సంబంధిత అధికారులు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థుల చదువులు పట్ల అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    RAMAGUNDAM SC HOSTEL



    హాస్టల్‌కు పూర్వ వైభవం తీసుకు రండి:
    స్వర్ణ, ప్రిన్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాల \"ఎస్సీ హాస్టల్‌ మూతపడడం బాధాకరంగా ఉంది. ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకునేందుకు మారుమూల ప్రాంతాల నుంచి ఎస్సీ విద్యార్థులు వచ్చే వారు. కరోనా తరువాత ఇక్కడ ఉండటానికి విద్యార్థులు ఆసక్తి చూపించలేదు. కొందరు విద్యార్థులు టీసీలు తీసుకువెళ్లి ఇతర పాఠశాలలో జాయిన్ అవుతున్నారు\" అంటూ ప్రినిసిపల్ స్వర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని. సంబంధిత అధికారులు, రాష్ట్ర విద్యా శాఖ, సంక్షేమశాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని స్వర్ణ కోరారు. ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు ఉన్న రామగుండం ప్రాంతంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో ఎస్సీ హాస్టల్‌ను కూడా అభివృద్ధి చేసి విద్యార్థులకు బాసటగా నిలవాలని ప్రిన్సిపల్ స్వర్ణ కోరుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Hostel students, Local News, Peddapalli, Ramagundam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు