Home /News /telangana /

PEDDAPALLI SARVESWAR FROM GODAVARIKHANI IN PEDDAPALLI DISTRICT IS SHOWING GOOD TALENT IN MIRROR WRITING BY WRITING THE WORDS IN INVERTED PSE NJ PRV

Mirror Writing: అతను రాసింది చదవాలంటే అద్దం కావాల్సిందే.. మిర్రర్‌ రైటింగ్‌లో అతను అదుర్స్‌!

మిర్రర్‌

మిర్రర్‌ రైటింగ్‌

అతను రాసింది చదవాలంటే మనం అద్దం సహాయం తీసుకోవాల్సిందే. లేదంటే బుర్ర తిరిగిపోతుంది. ఇంతకీ అతను అంతా ఎందుకు అలా రివర్స్‌ రాస్తున్నాడు..అది కూడా మనం రాసినంత స్పీడ్‌గానే…అదెలా సాధ్యమైంది?

    (E.Santosh,News18,Peddapalli)

    Mirror Writing: మీరు ఎప్పుడైనా ఆంబులెన్స్‌ (AMBULENCE) మీద రాసిన అక్షరాలను చూశారా.. అన్ని అక్షరాలు తిరగేసినట్లు ఉంటాయి కదా.. అలా ఎందుకు రాస్తారంటే.. ఆ ఎమెర్జెన్సీ వెహికల్‌కు ముందు వెళ్లే వాహనదారులు అద్దంలో వెనక ఉన్న ఆంబులెన్స్‌ను చూస్తారు. వాళ్లకు అద్దంలో చూసినా క్లియర్‌గా ఆంబులెన్స్‌ అని కనిపిస్తుంది..వెంటనే ఆ ఎమర్జెన్సీ వాహనానికి దారి ఇస్తారు. ఇప్పుడు ఈ కథ ఎందుకు అనుకుంటున్నారా? ఆ రకమైన మిర్రర్‌ రైటింగ్‌లో మన తెలంగాణ యువకుడు అదరగొడుతున్నాడు.

    మిర్రర్ ల్వాంగేజ్‌

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖనికి చెందిన రామిళ్ల సర్వేశ్వర్‌  (Sarveswar)అనే యువకుడు చాలా అలవోకగా మిర్రర్ భాష(Mirror Writing)ను రాస్తున్నాడు, మిర్రర్ లాంగ్వేజ్‌ అని ఎందుకంటున్నామంటే అతను రాసింది అద్దంలో చూస్తే తప్ప ఎవ్వరికి అర్థం కాదు. సాధారణంగా మిగితా భాషలు రాసేటప్పుడు ఎంత స్పీడ్‌గా అయితే రాస్తాడో.. ఇలా రివర్స్‌లో రాసేటప్పుడు కూడా అంతే స్పీడుగా రాయడం ఇతని ప్రత్యేకత.

    మిర్రర్‌ రైటింగ్‌


    ఈ ప్రపంచంలో ఒక్కొక్కరి ప్రతిభ ఒక్కోలా ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి సత్తా చాటిన నాడే గుర్తింపు లభిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇంకా కుడి నుంచి ఎడమకు రాసే ఉర్దూ భాషను రాయడం చూసాం… కానీ సర్వేశ్వర్‌ మిర్రర్‌ భాష (Mirror Language) రాయడంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు.

    అద్దంలో చూస్తే..


    వృత్తి రిత్యా డాన్స్‌మాస్టర్‌

    రామిళ్ళ సర్వేశ్వర్ డ్యాన్స్ మాస్టర్‌ (Choreographer)గా శిక్షణ ఇస్తుంటాడు. కానీ తనకు ఇంకా ఏదో కొత్తగా ప్రయత్నించాలని తపన పడుతూ ఉండేవాడు. ఆ సమయంలోనే ఆంబులెన్స్‌ను చూసి…ఈ రివర్స్‌ రైటింగ్‌ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన మొదలైంది. అనుకున్నదే తడవుగా ప్రయత్నం చేశాడు.

    ఇప్పుడు అలవోకగా ఇన్వర్టెడ్‌ (Inverted)గా పదాలను రాస్తూ అదరగొడుతున్నాడు. ఆ జిల్లాలో ఇప్పటివరకు ఇలా రాసేవారు లేకపోవడంతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక్కడితో ఆగకుండా ప్రపంచానికి తన ప్రతిభను చాటుతానని చెపుతున్నారు సర్వేశ్వర్.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు