(P.Srinivas,New18,Karimnagar)
పెద్దపల్లిpeddapalli జిల్లా రామగుండంRamagundam ఎరువుల కర్మాగారం(RFCL)లో మరో బాదితుడు ఆత్మహత్యయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. ఉద్యోగం పేరుతో లక్షలు చెల్లించుకున్నాడు. అది కాస్తా మూడు నాళ్ల ముచ్చటగా మారడంతో భరించలేకపోయాడు. ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఉద్యోగం పేరుతో దళారులు చేసిన మోసాన్ని భరించలేకపోయాడు. అక్షరాల 8 లక్షల 50 వేల రూపాయలు దళారుల చేతిలో పెట్టినప్పటికి ఉద్యోగం కోల్పోవడంతో శ్రీనివాస్(Srinivas)అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్(Hyderabad)కు తరలించారు.
8.5లక్షలు తీసుకొని మోసం..
బాధితుడు శ్రీనివాస్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం కోసం కరీంనగర్ జిల్లా గంగధర మండలానికి చెందిన తూం నర్సయ్య, తూం తిరుపతికి 5 లక్షల 75 వేల రూపాయలు చెల్లించాడు. అలాగే సోసైటి పెద్దమనుషులుగా ఉన్నటువంటి ఉపేందర్,సంతోష్,రామస్వామికి 2 లక్షల 30 వేల రూపాయాలు ఇచ్చినట్లుగా బాధితుడు శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నాడు. సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం లోంచి తొలగించారు. చేసేందుకు పని లేకపోవటంతో భార్య బంగారు నగలు అమ్మి మరీ దళారులకు డబ్బులు ఇచ్చిన్నట్లుగా శ్రీనివాస్ భార్య తెలిపింది.
ప్రాణాలు పోతున్నాయ్..
ఉద్యోగం పోయి ...నగలు అమ్ముకొని ఇచ్చిన డబ్బులు పోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. ఈపరిస్థితుల్లోనే దళారులతో పోరాడే శక్తి లేక చావే శరణ్యమనుకొని శ్రీనివాస్ పురుగుల మందు తాగాడు. తాను చనిపోయిన తర్వాత అయినా తాను చెల్లించిన డబ్బులు తన కుటుంబానికి ఇవ్వాల్సిందిగా బాధితుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. మెన్న ముంజ హరీష్, నిన్న గంగల శేఖర్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో బాధితుల్లో కలవరం మరింత పెరిగింది. దళారులు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవటంతో బాదితులు ఆత్మహత్యయత్నం కు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.