Home /News /telangana /

PEDDAPALLI RED MANGO CROP IS BRINGING HIGH PROFITS TO THE FARMERS IN PEDDAPALLI DISTRICT SNR KNR

Red Mango : పెద్దపల్లి జిల్లాలో రైతుకు కాసుల వర్షం కురిపిస్తున్న ఎర్రమామిడి..దాని డిమాండే అంత

(టేస్టు, కాస్ట్ సూపరే)

(టేస్టు, కాస్ట్ సూపరే)

Peddapalli:సీజన్‌ని బట్టి పంటలు సాగు చేయడం కాదు..అందులో కూడా డిమాండ్‌ ఉన్న రకాలను పండించడమే లాభాదాయకమని పెద్దపల్లి జిల్లా రైతు నిరూపించారు. పాతికేళ్లుగా పండిస్తున్న సాధారణ మామిడి రకాలను కాదని ఎర్రమామిడి పండించడం వల్ల వచ్చిన ప్రతిఫలం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  ఏ సీజన్‌లో ఏ పంట సాగు చేస్తే ప్రతిఫలం బాగా వస్తుందో రైతులకు బాగా తెలుసు. ముఖ్యంగా పండ్ల తోటలు, వాణిజ్య పంటలు వేసే రైతులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాటిని సాగు చేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో తెలంగాణ(Telangana)లో చాలా చోట్ల మామిడి తోటలు వేశారు రైతులు. అయితే సాధారణంగా మామిడికి సమ్మర్‌లో బాగా డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్‌గా దొరికే రకాలు కాకుండా పెద్దపల్లి(Peddapalli)జిల్లాకు చెందిన ఓ రైతు మామిడి పండ్లలో రాజు లాంటి ఎర్ర మామిడి పండ్ల(Red Mango)ను పండించి పెద్దమొత్తంలో లాభాలు గడిస్తున్నాడు.

  ఎర్రమామిడికి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ..
  సీజన్‌ను బట్టి పంటలు సాగు వేయడం రైతులకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా ఇది మామిడి పంట దిగుబడి అయ్యే సీజన్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల మామిడి తోటలు వేశారు రైతులు. అయితే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కొత్తూరుకు చెందిన రైతు నెర్వట్ల రాయమల్లు అనే రైతు తన నాలుగు ఎకరాల భూమిలో 28 ఏళ్లుగా బంగినపల్లి, దసేరి , హిమాయత్ , కొబ్బరి మామిడి రకాలను సాగు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎర్ర మామిడి కాయలకు ఉన్న డిమాండ్‌తో పాటు ఆ పండ్ల రుచి అమోఘం అని తెలుసుకొని ఎర్రమామిడి పంట వేశారు.  టేస్ట్ సూపర్...కాస్ట్‌ అదుర్స్
  రాయమల్లు మూడు దశాబ్ధాలుగా మామిడి పంట పండిస్తున్నా సరైన లాభాలు రాకపోవడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఆయన కుమారులు నెర్వట్ల జయప్ర కాకానారాయణ , విజయకుమార్ తండ్రి శ్రమకు తగిన ప్రతిఫలం రావడం లేదని గ్రహించారు. మామిడి పంటలోనే లాభాలు వచ్చేలా చేయాలని సిద్ధిపేట దగ్గర ఒక రైతు ఎర్ర మామిడి పంటను వేయడం చూసి వచ్చి అదే రకం మామిడి పండించాలని తండ్రికి సూచించారు. అందులో భాగంగానే రాయమల్లు గత రెండేళ్ల క్రితం వేసిన మామిడి చెట్లు గతేడాది కాయలు కాసాయి. మొదటి సారి కేవలం 20కిలోల పంట మాత్రమే వచ్చింది. ఈసంవత్సరం నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతు రాయమల్లు సంతోషపడిపోతున్నారు.

  ఇది చదవండి : నిజామాబాద్ జిల్లాలో సెల్ఫీ వీడియో వైరల్..అందులో ఏముందో తెలుసా  మామిడిలోనే రారాజు రెడ్ మ్యాంగో..
  సాధారణంగా మామిడిలో బంగినపల్లి , కొబ్బరి , దసేరి , హిమాయత్‌ రకాలతో పోలిస్తే ఎర్ర మామిడికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ , ముంబై , బెంగళూర్ మార్కెట్లలో అధిక రేటు పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో ఎర్రమామిడి ధర 1000 అమ్ముతుండగా ముంబై , బెంగళూర్‌లో ఒక్కొక కాయ, లేదా పండు ధరరూ .2000 ఉంది. గత 28 ఏళ్లుగా మామిడి రైతు రాయమల్లు సాధారణ రకాల పండిస్తున్నప్పటికి సీజన్లో ఎకరాకు క్వింటల్‌కు నాలుగు క్వింటాళ్ల లాభం వచ్చిందంటున్నారు. అంతే కాదు ఈ ఎర్రమామిడి కావాలని మహా రాష్ట్ర నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారని గర్వంగా చెబుతున్నారు రైతులు రాయమల్లు.

  ఇది చదవండి: కూతురు పెళ్లి..తండ్రి చావు అంతా ఆ గంటలోనే జరిగింది  నాలుగు రెట్లు అధిక లాభం..
  ఈ ఎర్రమామిడి పంట గత కొంతకాలంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌కి చెందిన ఓ రైతు పండిస్తున్నారు. ఆయన మంచి దిగుబడి , లాభాలు పొందుతున్నట్లు తెలుసుకున్న నెర్వెట్ల రాయమల్లు కుమారులు పంట సాగు విధానం, మొక్కల ఆచూకి గురించి పూర్తిగా స్టడీ చేసారు. రెండేళ్ల క్రితం రెండు సంవత్సరాల వయసున్న 120 ఎర్ర మామిడి మొక్కలను తెచ్చారు. తమ తండ్రికి చెందిన తోటలో వాటిని శ్రద్ధగా నాటి పెంచుతూ వచ్చారు. ఈసారి ఆ 120 మొక్కలు చెట్లుగా మారడంతో ఒక్కో చెట్టు నుంచి 20 నుంచి 25 కాయలు కాశాయి. ఒక్కో కాయ 400 నుంచి 500 గ్రాముల బరువు ఉందని రైతు రాయమల్లు తెలిపారు. రెండేళ్ల మొక్కలను నాటితే మరో రెండేళ్ల సమయం కలుపుకొని నాలుగేళ్లలో 4 క్వింటల వరకు మామిడి దిగుబడి వచ్చింది. అంటే సాధారణ మామిడి రకమైన బంగన్ పల్లి ఒక టన్ను పంట దిగుబడికి సమానమైన లాభాలు వచ్చినట్లు రైతు రాయమల్లు ఎంతో ఆనందంతో చెప్పారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mangos, Peddapalli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు