హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: రామగుండం ఓసీపీ ఎఫెక్ట్.. ఇండ్ల గోడలకు పగుళ్లు

Peddapalli: రామగుండం ఓసీపీ ఎఫెక్ట్.. ఇండ్ల గోడలకు పగుళ్లు

ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు

Telangana: తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తానన్న కేసీఆర్ రామగుండం ప్రాంతాన్ని ఓసీపీల పేరుతో కాలుష్య కోరల్లోకి నెట్టి స్మశానంగా చేసి బొందల గడ్డగా మార్చరేంటి అని స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తానన్న కేసీఆర్ రామగుండం ప్రాంతాన్ని ఓసీపీల పేరుతో కాలుష్య కోరల్లోకి నెట్టి స్మశానంగా చేసి బొందల గడ్డగా మార్చరేంటి అని స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ ల వల్ల ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ల లోపు నివసిస్తున్న ప్రజలు శబ్ద కాలుష్యంతో అనేక భయాందోళనకు గురవు తున్నారు. దుమ్ము, ధూళి, విషవాయువుల వల్ల అనేక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని, 11 సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత క్షీణించి, బుద్ధిమాంద్యం ఎక్కువగా ఉంటుందని, గర్భిణీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన నివేదికలో తెలిపింది.

రేకుల షెడ్లు పగుళ్లు....

ఓసీపీల వల్ల చుట్టుపక్కల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగే సమయంలో ఇండ్ల గోడలు అన్నీ ఒక్కసారి కదులుతున్నాయి ఇంట్లో సామానులు అన్ని కింద పడుతున్నాయి. దుమ్ము అయితే లెక్కలేనంత ఇండ్ల చుట్టు పక్కల పడుతూనే ఉన్నది. మమ్మల్ని కాపాడాలని ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

షుటింగుల అందాలు కాదు మా బ్రతుకులు చూడండి..

ఓసీపీలో అధునాతమైన టెక్నాలజీతో కూడిన పరికరాలుఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొని బాంబ్ బ్లాస్ట్ శబ్దాలు రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అధికారులు ఎన్నిచెప్పినా ఓసీపీ పేలుళ్ల వల్ల ఇబ్బందులుఎదుర్కొంటున్నా.. స్థానిక ప్రజల పట్ల కనీస చిత్త శుద్ధి కూడా లేదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, ధూళి రాకుండా చెట్ల పెంపకం చేసి వాటర్ ట్యాంకర్ తో నీరు పట్టాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నీరు మాత్రం అప్పుడప్పుడూ పడుతున్నారు. కానీ, చెట్ల పెంపకంపై మాత్రం అంత శ్రద్ధ చూపటం లేదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీపీ పేలుళ్లతో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలను,ఓసీపీని ఆనుకొని ఉన్న ప్రాంతాలను ఆదుకోవాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు