(Santosh, News18, Peddapalli)
ఇప్పుడున్న జీవనశైలి పరిస్థతుల్లో ప్రతి ఒక్కరు వాకింగ్, వ్యాయామాలు (Exercise) తమ దైనందిన చర్యలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం వలన రోజంతా చురుకుగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా (Healthy) కూడా జీవించవచ్చు. ఆ విషయాన్ని గుర్తించిన రామగుండం (Ramagundam) నగర పాలక సంస్థ, పట్టణ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీఠ వేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కుల వద్ద ఓపెన్ జిమ్ (Open Gym) ఏర్పాటు చేసింది. పార్కుల వద్ద ప్రత్యేకంగా జిమ్ పరికరాలు (Gym equipment) ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం పట్టణం వ్యాప్తంగా పలు పార్కులు ఉన్నాయి. పట్టణ ప్రజల కోసం ఎంతో సుందరంగా ఈ పార్కులను ముస్తాబు చేసింది నగరపాలక సంస్థ. అయితే గతంలో ఈ పార్కుల నిర్వహణ సరిగా లేక.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. దీంతో సాధారణ ప్రజలు పార్కుల వైపు చూడ్డం మానేశారు. కొన్ని రోజుల అనంతరం రంగంలోకి దిగిన మునిసిపల్ సిబ్బంది పార్కులను (Parks) తిరిగి బాగుచేశారు. అంతేకాదు జనావాసాల మధ్యనున్న పార్కులలో ప్రజలను ఆకర్శించే విధంగా ఈ ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయాన్నే పదుల సంఖ్యలో ప్రజలు పార్కులకు వచ్చి మార్నింగ్ వాక్, ఇతర వ్యాయామాలు చేస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయాన్నే చేసే వ్యాయామం కారణంగా శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది మన పనితీరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. సాయంత్రం వ్యాయామంతో పోల్చితే ఉదయపు వ్యాయాయం ద్వారా శరీరంలో కొవ్వు త్వరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జిమ్లో ఉపయోగించే పరికరాలను బట్టి శారీరక దృఢత్వం కలుగుతుంది. నడకను (Walk) రోజు వారి పనుల్లో భాగం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదు. ఏ వయసు వారైనా చేయగలిగే వ్యాయామం నడక. వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తయారవుతాయి.
Bhadradri: ఎక్కడిక్కడే నిలిచిపోయిన మన ఊరు - మన బడి పనులు.. ఏజెన్సీ పాఠశాలలంటే చులకనా?
రామగుండం మునిసిపాలిటీ పరిధిలోని దాదాపు అన్ని పార్కులలో ఈ ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పరికరాల్లో 7 పరికరాలు ప్రధానంగా ఉన్నాయి. పొట్ట తగ్గేందుకు కూర్చుని నడుం తిప్పే పరికరం, చేతులు గట్టిపడేలా స్టీరింగ్ తిప్పే పరికరం, శరీరం మొత్తం కదిలేలా పడవ తెడ్డు తిప్పినట్లుగా తిప్పే పరికరం, ఛాతి భాగం కోసం బట్టర్ ఫ్లై పరికరం, కాళ్లతో నడిచేలా మరొక పరికరం అందుబాటులో ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం కోసం మునిసిపాలిటీ చేస్తున్న అభివృద్ధి పనులను స్థానికులు అభినందిస్తున్నారు. అదే సమయంలో ఈ పరికరాలు అసంఘిక శక్తుల చేతుల్లో నాశనం కాకుండా రక్షణ, నిర్వహణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exercises, Gym, Local News, Peddapalli, Ramagundam