హోమ్ /వార్తలు /తెలంగాణ /

జంతుబలిచ్చిన డాక్టర్..? వైద్యంపై నమ్మకం పోయిందా..? అసలు స్టోరీ ఏంటంటే..!

జంతుబలిచ్చిన డాక్టర్..? వైద్యంపై నమ్మకం పోయిందా..? అసలు స్టోరీ ఏంటంటే..!

రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జంతుబలి..?

రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జంతుబలి..?

గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లా (Peddapalli District) లోని ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ లు అనారోగ్య సమస్యలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల కొంత మంది మృత్యు వాత పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Ramagundam | Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

'గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లా (Peddapalli District) లోని ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ లు అనారోగ్య సమస్యలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల కొంత మంది మృత్యు వాత పడుతున్నారు. దీంతో కార్పొరేషన్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి కార్పొరేషన్ లో జంతు బలి చేస్తే సమస్యలు తీరుతాయనే మూఢనమ్మకంతో జంతువుని బలిచ్చారు. కార్పొరేషన్ పెద్ద.. అందులోనూ ఆయన ఆరోగ్యాలను కాపాడే విధులు నిర్వహించే డాక్టర్ అయి కూడా మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూ రామగుండం (Ramagundam) కార్పొరేషన్ కార్యాలయంలో జంతు బలినివ్వడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

డాక్టర్ అయి కూడా ఇలా చేయడం ఎంటి?

నమ్మకం, మూఢ నమ్మకం మధ్యన ఉన్న తేడా ఏమిటనేది ప్రజలకు తెలియజేయాల్సిన రామగుండం మేయర్.. ఇలా మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. మూఢ నమ్మకాన్ని శాస్త్రీయం అనే పేరుతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు జీవంలేని వస్తువులను కొందరు వాడితే.. మరికొందరు ఇలా బలి పేరుతో మూగజీవాల ఉసురుతీస్తున్నారు.

ఇది చదవండి: చెత్తకాగితాలు ఏరుకుంటూ కటింగ్ ఇచ్చారు.. చేసేది మాత్రం వేరేపని

మరికొందరు పనికి రాని బాబాలను ప్రోత్సహిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్.. రామగుండం కార్పొరేషన్ కు మైదటి పౌరుడు.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా డాక్టర్ గా కొనసాగుతున్నారు. డాక్టర్ అయి ఉండి ఇలా శాంతి పూజలు నిర్వహించడం, అందులో మళ్ళీ ఒక మూగ జీవుని కార్పొరేషన్ కార్యాలయంలో బలిచ్చి.. రక్తపు మడుగులో శాంతి పూజ నిర్వహించడం సంచలనంగా మారింది. ఇలా బలుల ద్వారా ఈయన ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు.

కొన్ని రోజులుగా మరణాలు..!

రామగుండం కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు గత కొన్ని రోజులుగాఏదో ఒక కారణంతో మృత్యువాత పడుతున్నారు. గతంలో ఇద్దరు గుండెపోటుతో, ఇటీవల ఓ సీనియర్ కాంట్రాక్టర్ ప్రమాదానికి గురై చనిపోయారు. దీంతో భయాందోళనకు గురవుతున్న కాంట్రాక్టర్లు కార్పొరేషన్ లో కీడు సోకిందని.. బలి ఇస్తే కానీ పోదు అని ఆదివారం తెల్లవారు జామున శాంతిపూజ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుకున్నట్లే తంతు ముగించారు. అయితే, మేయర్ సమక్షంలోనే పూజలు నిర్వహించి, జంతువులను బలివ్వడం నగరపౌరులను కలవరానికి గురిచేసింది. విషయం బయటకు పొక్కడంతో పూజలు చేసిన ఆనవాళ్లు లేకుండా కార్పొరేషన్ ట్యాంకర్లతో శుభ్రం చేశారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు