Home /News /telangana /

PEDDAPALLI RAMAGUNDAM GOVT PRIAMRY SCHOOL ATTRACTING STUDENTS WITH FIRST EVER DIGITAL CLASSES ABH BRV PSE

Peddapalli: ఆ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు ఎందుకు బారులు తీరుతున్నారు?

peddapalli

peddapalli local news

ప్రభుత్వ పాఠశాలలు సైతం ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఈరోజుల్లో. అటువంటి పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందంటే ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధిలో ఉన్నాయో అర్ధం అవుతుంది.

    (E.Santosh, News 18, Peddapalli)

    ప్రభుత్వ పాఠశాలలంటే ఈరోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో చిన్నచూపు. అక్కడి చదువులతో తమ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోనన్న భయం తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే అరకొర వసతులు, గాడి తప్పిన విద్యాబోధన ఉంటున్న పరిస్థితుల్లో ఇక ప్రాథమిక పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూడడమూ లేదు. అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటూ ర్యాంకులు, మార్కులతో దూసుకుపోతున్న ప్రైవేటు విద్యాసంస్థల వైపే తల్లిదండ్రులు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. ప్రభుత్వ పాఠశాలలు సైతం ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈరోజుల్లో అటువంటి పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందంటే ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధిలో ఉన్నాయో అర్ధం అవుతుంది.

    ఆ పాఠశాలలో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు బారులు:
    వేసవి కాలం వచ్చిందంటే చాలు విద్యార్థుల కోసం ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ తమ పాఠశాలలో అడ్మిషన్ కోసం పరుగులు పెడుతుంటారు. కానీ గోదావరిఖనిలోని గాంధీ పార్క్ స్కూల్‌లో అడ్మిషన్ కొరకు తల్లిదండ్రులే బారులు తీరుతారు. ప్రైవేటు పాఠశాలల ఊసే ఎత్తని ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు ఏరికోరి ఆ గాంధీ పార్క్ ప్రైమరీ పాఠశాలనే ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రీ ప్రైమరీ తరగతుల్లోనే డిజిటల్ తరగతుల్లో బోధన ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.

    రీడ్ టు రూమ్ అనే కాన్సెప్ట్ తో విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. డిజిటల్ తరగతులతో చిన్నారులు ఎంతో సంబరంగా ఆడుతూపాడుతూ పాఠాలు నేర్చుకుంటారు. విని నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకున్న పాఠాలు పిల్లలకు ఎక్కువగా గుర్తుంటుందని కాబట్టి పిల్లలకు ఈ డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగ పడుతున్నాయని గాంధీ పార్క్ స్కూల్ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. కంప్యూటర్ క్లాసులు ఈ సంవత్సరమే ప్రారంభదశలో ఉన్నాయని త్వరలోనే అవి పూర్తిగా అందుబాటులోకి తేనున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రీడ్ టు రూం (Read to room) అనే కాన్సెప్ట్ వల్ల పిల్లలకి ఎంతో మేధో శక్తి పెరుగుతుదని వారు అంటున్నారు.

    పదేళ్ల క్రితమే ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు:
    గోదావరిఖని ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని 10 ఏళ్ల క్రితమే ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించారు. \"మొదట్లో పిల్లల అడ్మిషన్స్ కొరకు ఇంటింటా తిరిగి తల్లిదంద్రులతో మాట్లాడి ఇంగ్లీష్ తరగతులు ఉన్నాయని చెప్పి అడ్మిషన్లు చేశాము. ఆ తరువాత మాపై నమ్మకం కలిగి పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికే పంపుతున్నారు. ఇప్పుడు ఎంతో విజయవంతంగా సాగుతుంది, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా ఉద్దేశం, మా ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుగా సాగుతున్నాము\" అని ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు పునాదులు గట్టిగా ఉండాలనే సంకల్పంతో వారికి అర్థమయ్యేలా ఆడుతూపాడుతూ ఓపికగా పాఠాలు భోదిస్తున్నామని అన్నారు.



    పిల్లల హజరును బట్టి మధ్యాహ్న భోజనం అందరికీ సరిపోయేలా మెనూ ప్రకారం పౌష్టికాహారం కూడా అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో గాంధీ పార్క్ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కొన్ని అసౌకర్యాలు కలుగుతున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. స్కూల్‌లో బాత్రూం మరియు డైనింగ్ హాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పాఠశాల నిర్వాహకులు కోరుతున్నారు.
    పాఠశాలలో అడ్మిషన్స్ కొరకు ఇంచార్జి ప్రిన్సిపాల్ స్వరూప్ చాంద్‌ని కలవచ్చు. ఫోన్ నెంబర్ +9190595 78889
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు