హోమ్ /వార్తలు /తెలంగాణ /

రామగుండం అరదైన ఘనత.. తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ..!

రామగుండం అరదైన ఘనత.. తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ..!

రామగుండం అరుదైన ఘనత

రామగుండం అరుదైన ఘనత

సిటిజన్‌ పర్సెప్షన్‌ సర్వేలో రామగుండం నగరపాలక సంస్థ (Ramagundam Municipal Corporation) ఎంపికైంది. రామగుండం అభివృద్ధిలో దిన దినం ముందు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ ఇదివరకే పలు మార్లు స్వచ్ఛ సర్వెక్షన్ లో మంచి ర్యాంక్ తో ప్రతి ఏడాది ముందు ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Ramagundam | Telangana

E.Santosh, News18, Peddapalli

సిటిజన్‌ పర్సెప్షన్‌ సర్వేలో రామగుండం నగరపాలక సంస్థ (Ramagundam Municipal Corporation) ఎంపికైంది. రామగుండం అభివృద్ధిలో దిన దినం ముందు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ ఇదివరకే పలు మార్లు స్వచ్ఛ సర్వెక్షన్ లో మంచి ర్యాంక్ తో ప్రతి ఏడాది ముందు ఉంటుంది. అలాగే ఈసారి ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్ ‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నగరాల్లో చేపట్టిన సిటిజన్‌ పర్సెప్షన్ ‌సర్వేలో తెలంగాణ (Telangana) నుంచి రామగుండం నగరపాలక సంస్థ మాత్రమే ఎంపికైంది. ఈ సర్వేలో వంద మార్కులకుగాను రామగుండం నగరపాలక సంస్థ 100 మార్కులు సాధించింది. అర్బన్‌ ఔట్‌ కం ప్రేమ్‌ వర్క్స్ ‌లో భాగం గా ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ రూపొందించుట కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.

సిటీ లెవల్‌ బోర్డ్‌ ఫర్‌ సీపీఎస్‌ యాక్టివిటీస్‌ 2022 పేరుతో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ జాబితా విడుదల చేసింది. ఈ జబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి రామగుండం మాత్రమే 100 మార్కులు సాధించి చోటు దక్కించుకుంది. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో భాగంగా నగరంలో జీవన నాణ్యతకు సంబంధించి పౌరుల అవగాహనను, పౌరుల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని ఈ సర్వే నిర్వహించారు.

ఇది చదవండి: యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్..! ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే.!

ఈ సర్వేలో భాగంగా ప్రచార అవగాహన కొరకు బిల్‌ బొర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయానికి 10 మార్కు లు, కుడ్య చిత్రాలకు 20మార్కులు, కంపెన్‌కు 10మార్కులు, రెఫరల్‌ సర్వే ప్రమోషన్‌కు 20 మార్కులు, ప్రింట్‌ మీడియా 10, డిజిటల్‌ మీడియా 10, ఇన్నోవేటివ్‌, ఇన్సియేటివ్‌కు 20 మార్కులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా గుర్తించిన నగరాలే ఈ జాబితాలో ఎక్కువగా చోటు సంపాదించుకున్నాయి.

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్ ‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నగరాల్లో చేపట్టిన సిటిజన్‌ పర్సెప్షన్‌ సర్వేలో తెలంగాణ నుంచి రామగుండం నగరపాలక సంస్థ మాత్రమే ఎంపికైంది. ఈ సర్వేలో వంద మార్కులకుగాను రామగుండం నగరపాలక సంస్థ 100 మార్కులు సాధించింది. రామగుండం నగరానికి గుర్తింపు లభించడానికి శ్రమించిన అర్బన్‌ ఔట్ ‌కం ప్రేమ్ ‌వర్క్‌ నోడల్‌ అధికారి, డిప్యూటీ కమిషనర్‌ నారాయణరావును, సిబ్బందిని మేయర్‌ బంగి అనీల్ ‌కుమార్‌, కమిషనర్‌ సుమన్ ‌రావు అభినందించారు.

First published:

Tags: Local News, Peddapalli, Ramagundam, Telangana

ఉత్తమ కథలు