హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన డాక్టర్‌ ..కడుపులో ఏం పెట్టిందో తెలుసా..?

OMG: గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన డాక్టర్‌ ..కడుపులో ఏం పెట్టిందో తెలుసా..?

Danger Doctor

Danger Doctor

OMG: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేసింది ఓ మహిళా వైద్యురాలు. తర్వాత ప్రసూతి మహిళను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి సదరు మహిళ కడుపు నొప్పుతో బాధ పడుతూ ఉంది. కడుపులో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిందన్న చందంగా మారింది ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల పరిస్థితి. పెద్దపల్లి(Peddapally)జిల్లా గోదావరిఖని(Godavarikhani)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేసింది ఓ మహిళా వైద్యురాలు. తర్వాత ప్రసూతి మహిళను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి సదరు మహిళ కడుపు నొప్పుతో బాధ పడుతూ ఉంది. నొప్పి ఎక్కువ కావడంతో హైదరాబాద్‌(Hyderabad)లోని పరీక్షలు చేయించారు కుటుంబ సభ్యులు. టెస్టుల్లో ఏమి తెలియకపోవడంతో ఎక్స్‌రేలు తీశారు. అప్పుడు గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ వెలగబెట్టిన ఘనకార్యం బయటపడింది. ఎక్స్‌రేలో కడుపులో కత్తెర ఉన్నట్లుగా తేలింది. మహిళను వివరాలు అఢగటంతో ఐదేళ్ల క్రితం జరిగిన తన డెలవరీ(Delivery) విషయం చెప్పడంతో గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ (Doctor)నిర్వాకంగా తెలిపింది.

కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్..

పెద్ధపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ ఐదేళ్ల క్రితం ఓ మహిళకు డెలవరీ చేసింది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయింది. ఈవిషయం ఐదేళ్ల తర్వాత బయటపడింది. మహిళకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించారు బంధువులు. కడుపును ఎక్స్ రే తీయడంతో ఎక్స్‌రేలో మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. విషయం తెలుసుకున్న మహిళ, ఆమె బంధువులు షాక్ అయ్యారు. వెంటనే గోదావరనిఖని వచ్చి ఆపరేషన్ చేసిన లేడీ డాక్టర్‌ని నిలదీశారు. చేసిన తప్పును అంగీకరించిన ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కత్తెర తీయడానికి చేసే సర్జరీ ఖర్చు తానే భరిస్తానని చెప్పడంతో ట్రీట్‌మెంట్ కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.

ఎక్స్‌రేలో బయటపడ్డ పొరపాటు..

వైద్యో నారాయణో హరి అనే నానుడ్ని నిజం చేస్తున్నారు కొందరు ప్రైవేట్ డాక్టర్లు. రోగుల ప్రాణాలు కాపాడమంటే వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ నిర్లక్ష్యంగా కడుపులో కత్తెరలు, కాటన్‌ పెట్టి మర్చిపోతున్నారు. గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగినట్లుగానే ఏపీలోని మైలవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కూడా మహిళ కడుపులో కాటన్ మర్చిపోయారు. రోగి బంధువులు నిలదీయడంతో ఏడు లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి తప్పును కప్పిపుచ్చుకున్నారు.

First published:

Tags: Doctors, Peddapalli, Telangana News