Home /News /telangana /

PEDDAPALLI PRIME MINISTER NARENDRA MODI HAS VIRTUALLY INAUGURATED THE FLOATING SOLAR POWER PROJECT OF RAMAGUNDAM NTPC IN PEDDAPALLY PRV

Floating solar power project on water: తెలంగాణలో నీటిపై తేలియాడే సోలార్​ ప్రాజెక్టు.. ప్రారంభించిన ప్రధాని మోదీ.. పూర్తి  వివరాలివే

నరేంద్ర మోదీ (ఫైల్​)

నరేంద్ర మోదీ (ఫైల్​)

తెలంగాణలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ గా ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు.

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును (A floating solar power project on water) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) శనివారం వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాలలో విస్తరించి ఉన్న సోలార్ ఫోటో-వోల్టాయిక్ ప్రాజెక్టులో 4.5 లక్షల సోలార్ ప్యానెల్స్‌ ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు (A floating solar power project on water) ఇది. దీన్ని మోదీ వర్చువల్ (Virtual) విధానంలో ప్రారంభించారు. రామగుండం (ramagundam) లో రూ.423 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ జలాశయంలోని 500 ఎకరాల విస్తీర్ణంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును రెండేళ్ల వ్యవధిలో నిర్మించారు. ఏడాది జులై 1న ప్రాజెక్టులో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు.

    దక్షిణ భారతదేశానికి వెలుగులు..

    ఈ సందర్భంగా ఎన్టీపీసీ (NTPC) సీజీఎం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతుందన్నారు. 70 వేల మెగావాట్ల సామర్థ్యంతో దక్షిణ భారతదేశానికీ వెలుగులు పంచుతూ... మరో 16 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నూతన ప్లాంట్ నిర్మాణంలో ఉందని సునీల్ చెప్పారు. మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పనికి కరెంటు తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మొబిలిటీ, హైడ్రోజన్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు.



    విద్యుత్ ఉత్పత్తిరంగంలో రామగుండం ఎన్టీపీసీ కి ఉజ్వల భవిష్యత్తు ఉందని సునీల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులను, కార్మికులను ఆయన అభినందించారు. డిజిటల్ ప్లాట్ ఫారంపై ప్రధాని మోదీ 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా అధికారులతో కలిసి సీజీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

    ఎలా తేలుతుంది?

    సాధారణంగా ఏదైనా ఒక వస్తువు నీటి పై తెలియడాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి, నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. సౌరఫలకాలు కూడా బరువు తక్కువగానే ఉంటాయి. ఇక్కడ సమస్యల్లా వాటిని ఫ్రేమ్‌లో అమర్చి..ఒకదానికొకటి అనుసంధానం చేయడం. ఇలా చేస్తే ఎక్కడో ఒక దగ్గర బరువు పెరిగినా ఫలకాలు నీటిలో మునిగిపోతాయి. అటువంటప్పుడు సూర్యకాంతి ప్రసరించక విద్యుత్ ఉత్పత్తి జరగదు. మరి ఈ సమస్యలన్నిటినీ ఎలా అధిగమించారు?. ఓడరేవులు, మెరైన్ తీరాల్లో నీటిపై తెలియాడేలా ఓడల డాకింగ్ కోసం వాడే "డ్రై డాక్" పద్దతిని అనుసరించి స్ట్రింగ్లను ఏర్పాటు చేశారు. ఆ స్ట్రింగ్లకు హెచ్‌డీపీఈ (హై డెన్సిటీ పాలిథిలిన్)తో తయారు చేసిన ఫ్లోటర్లను (తేలియాడే) ఏర్పాటు చేసి సౌర ఫలకాలు బిగించారు. క్రిస్టలిక్ సిలికాన్ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫొటో వోల్టాయిక్ ప్యానళ్లను విద్యుత్ ఉత్పత్తికి వినియ…
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: NTPC, Peddapalli, PM Narendra Modi, Ramagundam, Solar power

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు