Home /News /telangana /

PEDDAPALLI POLICE DELAYED 5 HOURS TO FILE CASE ON ACCIDENT BECAUSE OF STATION LIMITS IN PEDDAPALLI BRV PSE ABH

Peddapalli: రోడ్డుపై ప్రమాదం: 5 గంటల పాటు పోలీసుల మధ్య సరిహద్దు పంచాయితీ

ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లమ్మ మృత దేహం

ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లమ్మ మృత దేహం

పెద్దపల్లి జిల్లాలోని రెండు మండలాల సరిహద్దు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం రెండు మండలాల పోలీసుల మధ్య పంచాయితీకి దారితీసింది. దాదాపు 5 గంటల పంచాయితీ అనంతరం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    E.Santosh, News 18, Peddapalli

    Peddapalli; పెద్దపల్లి జిల్లాలోని రెండు మండలాల సరిహద్దు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం రెండు మండలాల పోలీసుల మధ్య పంచాయితీకి దారితీసింది. దాదాపు 5 గంటల పంచాయితీ అనంతరం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ - అంతర్గాం సమీప ప్రాంతంలోని రాజీవ్ రహదారిపై ఫ్లై ఓవర్ వద్ద సోమవారం ప్రమాదం జరిగింది. అప్పన్నపేటకు చెందిన పుట్ట మల్లమ్మ... గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది.

    సోమవారం స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలకు హాజరై కార్యక్రమం ముగిశాక దామెరకొండ శంకర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోరాజీవ్ రహదారిపై ఫారెస్ట్ పార్కు వద్ద వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు వీరి బైక్ ను ఢీకొనడంతో మల్లమ్మ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. వాహనంతో పాటు శంకర్ రోడ్డు పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లగా గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలైన మల్లమ్మను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

    అప్పటి వరకు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో త్రివర్ణ పతాకంతో ఉత్సాహంగా కనిపించిన మల్లమ్మ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదం నింపింది. గతంలో తన భర్త మరణించడంతో మల్లమ్మకు సర్కారు కొలువు వచ్చింది. పుట్టెడు కష్టాలు పడుతూ ఐదుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం ఒక కుమార్తె వద్ద ఉంటోంది. మల్లమ్మ మరణించడంతో బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.

    Read This Also; Rajanna Sircilla: రాజన్నకు లోపాలతో ఉన్న కోడెలను ఇస్తున్న భక్తులు: భక్తుల తీరుతో కొత్త చిక్కులు 



    పోలీసుల మధ్య సరిహద్దు వివాదం: కాగా, ఈ ప్రమాదం పాలకుర్తి - అంతర్గాం మండలాల మధ్య చోటుచేసుకుకోవడంతో ఇరు మండలాల పోలీసులు తమ పరిధి కాదంటూ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అంతర్గాం పోలీసులు మా పరిధి కాదని కేసు నమోదు చేయకపోగా... పాలకుర్తి పోలీసులు సుమారు 5 గంటల పాటు జాప్యం చేశారు. చివరకు అంతర్గాం పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంకటరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు అంతర్గాం ఎస్సై సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు