Home /News /telangana /

PEDDAPALLI PEOPLE WAITING FOR AIRPORT TO OPERATE WILL THEIR DREAM COME TRUE BA KNR

Peddapalli: పెద్దపల్లి జిల్లా ప్రజల పదేళ్ల కల నెరవేరవేరే టైమ్ వచ్చిందా?

పెద్దపల్లి నేమ్ బోర్డు

పెద్దపల్లి నేమ్ బోర్డు

పెద్దపల్లి మండలం బసంత నగర్ విమానాశ్రయం గత కొంత కాలంగా నిరుపయోగంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విమానాశ్రయాలు పెంచాలని భావించింది.

    దశాబ్ద కాలంగా పెద్దపల్లి వాసుల కల కలగానే ఉంటుందా? నెరవేరుతుందా? అని సందిగ్ధం లో పడ్డారు పెద్దపల్లి జిల్లా ప్రజలు. పెద్దపల్లి మండలం బసంత నగర్ విమానాశ్రయం గత కొంత కాలంగా నిరుపయోగంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విమానాశ్రయాలు పెంచాలని భావించింది. ఇదే నేపథ్యంలో బసంత్ నగర్ విమానాశ్రయం తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఇటీవల ఏవియేషన్ అధికారులు బసంత నగర్ ఎయిర్ పోర్టుని సర్వే చేసింది. శ్రీనివాస్ అనే ప్రత్యేక అధికారి వచ్చి సర్వే చేశారు. ఎయిర్ పోర్టు కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి పై అధికారులకు పంపించారు శ్రీనివాస్. అయితే గతంలో కూడా ఎన్నో సార్లు ఎయిర్ పోర్ట్ ను పలు అధికారులు సందర్శించారు కానీ ఇప్పటికీ ఎయిర్ పోర్టు అనుమతి పూర్తి కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ ప్రాంతంలో విమానాశ్రయం వస్తే తమ భూములకు డిమాండ్ వస్తుంది అని, తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్థానికులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రతి సారి అధికారులు రావడం సర్వే చేయడం విషయం మరుగున పడడం మామూలు అయిపోయింది. దీంతో స్థానిక ప్రజలు అసలు విమానాశ్రయం వస్తుందా రాదా అనే సందిగ్ధం లో పడ్డారు. ఈసారి కూడా అందని ద్రాక్ష లాగానే మారనుందా? లేకపోతే విమానం ఎగురుతుందా చూడాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు