హోమ్ /వార్తలు /తెలంగాణ /

కౌజు పిట్టలతో నెలకు రూ.75వేలు.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్

కౌజు పిట్టలతో నెలకు రూ.75వేలు.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్

X
కౌజు

కౌజు పిట్టలతో లాభాలు ఆర్జిస్తున్న పెద్దపల్లి యువకుడు

Business Idea: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు చాలా మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే విధంగా వారికి అనుకూలమైన రంగాలను ఎంచుకుని సక్సెస్ అవుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు చాలా మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే విధంగా వారికి అనుకూలమైన రంగాలను ఎంచుకుని సక్సెస్ అవుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే పెద్దపల్లి జిల్లా (Peddapalli)  చెందిన యువకుడు దేవేందర్. పీజీ చదివిన దేవేందర్ ఫ్యూచర్ లో ప్రొఫెషనల్ గా సెట్ అయ్యేందుకు హైదరబాద్  (Hyderabad) వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా చేరాడు. సిటీ లైఫ్ బాగానే ఉన్నా జీతం మాత్రం నెల తిరిగే సరికి చేతిలో ఉండటం లేదు. దీంతో దేవేందర్ కొన్నాళ్ళకి ఉద్యోగం వదిలేసి ఊరి బాట పట్టాడు.

దేవేందర్ చిన్నానాటి నుండే అమ్మ నాన్న నాటు కోళ్ల పెంపకం చేసేవారు. దీంతో దేవేందర్ కోళ్ల పెంపకంపై దృష్టి సాధించాడు. సుమారు ఆరు నెలల పాటు వాటి పెంపకం, మార్గ నిర్దేశం ఎలానో అని పలు రాష్ట్రాలు తిరిగి తెలుసుకున్నాడు. మొదట్లో కడక్ నాథ్ కోళ్లు, నాటు కోళ్లు పెంచిన దేవేందర్ మెల్లిగా మెల్లిగా బిజినెస్ ను పెంచుతూ వచ్చాడు. సుమారు రెండు సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డ దేవేందర్ లాభాలు గడించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా వాటిపైనే తన సమయం అంతా కేటాయించి పెంపకం చేశాడు.

ఇది చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాదర్శకత కోసమే ఇదంతా..

అలా పెద్దపల్లి రఘవపురం వద్ద 1 ఒక ఎకరం 20 గంటల మామిడి తోటను లీజుకు తీసుకొని కౌజు పిట్టలు, నాటు కోళ్లు, చీమ కోళ్లు, కడక్ నాథ్ కోళ్ల పెంపకం వైపు కదిలాడు. ఎక్కువ పోషక విలువలు కలిగి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తూ తోటి యువతకు, నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ఇది చదవండి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై డెడ్ లైన్.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

కౌజు పిట్టతో లాభాల బాట..!

కౌజు పిట్టల పెంపకం యువతకు స్వయం ఉపాధి మార్గంగా మారింది. కోడి మాంసం కంటే రుచిగా, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండటం వల్ల మార్కెట్‌లో వీటికి గిరాకీ ఏర్పడింది. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు ఈ కౌజు పిట్టల మాంసం ఎంతో పౌష్టిక ఆహారమే కాక, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడే అధిక పోషకాలు ఉంటే ఈ గుడ్లు తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ కోళ్లతో పోల్చుకుంటే ఒక్క కోడి పెంచే స్థలంలో 8 నుంచి 10 కౌజు పిట్టలను పెంచవచ్చు. ఈ నాలుగు నుంచి ఐదు వారాల్లో పక్షులు మార్కెట్‌లోకి రావడంతో యువకులు, నిరుద్యోగులకు చక్కటి ఉపాధి మార్గంగా మారింది.

దేవేందర్ ఫార్మ్ ప్రయాణం..!

దేవేందర్ ఐదేళ్ల క్రితం ఈ ఫార్మ్ ప్రారంభించాడు. కోళ్లు, కౌజు, కథకనాధ్ పెంపకం మొదలు పెట్టాడు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. చేక్స్ పెంపకం కోసం దేవేందర్ మామిడి తోటను లీజుకు తీుకున్నారు. ఫార్మ్ కోసం తక్కువ ఖర్చుతో అనువైన షెడ్డును, కేజ్ లను నిర్మించుకున్నాడు. దాణా, నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నెలకు సుమారు డెబ్బై వేల రూపాయలు వరకు లాభాలు పొందుతున్నాడు. దేవేందర్ తెలుగు రాష్ట్రాల రాజధానుల నుండి అధికంగా ఆర్డర్లు వస్తాయని తెలిపాడు. దీంతో పాటే దేవేందర్ తన ఫార్మ్ లో ఆర్డర్ పై కుకింగ్ చేసి ఇస్తాడు. రాజు దగ్గర కోజు పిట్ట, నాటు కోళ్లు, కథకనాత్ కోళ్లు, చీమ వంటివి లభిస్తాయి. పెంపకం కాకుండా దేవేందర్ వంట ఆర్డర్లు కూడా అధికంగా ఉంటాయని తెలిపాడు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు