Home /News /telangana /

PEDDAPALLI PEDDAPALLI SELF EMPLOYED YOUTH MADE SUCCESS IN COUNTRY CHICKEN FARMING FULL DETAILS HERE PSE BRV PRV

Business Idea: కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో విజయం.. స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలుస్తున్న యువకులు

రాష్ట్ర

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ చేతులమీదుగా అవార్డ్ తీసుకున్న రాజు

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి ఏర్పరుచుకుని సొంతంగా ఎదగాలని పరితపించారు. చాలా మంది నష్టపోతున్నా ఆ వ్యాపారాన్నే (Business Idea) తామూ ప్రారంభించాలని ఆ అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. మరి ఎలా సక్సెస్ అయ్యారు?

    (E. Santosh, News18, Peddapalli)

    ఉన్నత చదువులు చదివిన ఆ యువకులు అందరిలా ఉద్యోగ వేటకు వెళ్ళలేదు. సొంత ఊరిలోనే స్వయం ఉపాధి ఏర్పరుచుకుని సొంతంగా ఎదగాలని పరితపించారు. సొంతంగా ఏ వ్యాపారం చేద్దామన్న నష్టాల భయం వెంటాడింది. ఇరుగుపొరుగున కొందరు కోళ్ల పెంపకం చేస్తున్నా వారికీ సరిగా లాభాలు లేవు. చాలా మంది నష్టపోతున్నా ఆ వ్యాపారాన్నే (Business Idea) తామూ ప్రారంభించాలని ఆ అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. మరి ఎలా సక్సెస్ అయ్యారు?

    నాటు కోళ్ల పెంపకంతో ప్రారంభం..

    సతీష్, రాజు, శ్యామ్ సుందరం.. ముగ్గురూ అన్నదమ్ములు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయ్ దండి (Rayadandi) గ్రామానికి చెందిన వీరు స్వయం ఉపాధి ద్వారా ఎదగాలని భావించారు. స్థానికంగా నాటు కోళ్లకు (Country Chicken) డిమాండ్ ఉందని గ్రహించి తమ ఇంటి వద్దే నాటు కోళ్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నాటు కోళ్ల పెంపకం సాగుతున్నా అంత లాభసాటిగా మాత్రం లేదు. అయితే కోళ్ల పెంపకంలో ఆయా రైతులు చేస్తున్న తప్పిదాలను గుర్తించిన ఆ యువకులు.. ఆ తప్పిదాలను సరిచేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని గ్రహించారు.



    అనంతరం ఏడాది పాటు నాటు కోళ్ల పెంపకంపై రీసెర్చ్ కూడా చేశారు. కోళ్ల ఫారాల వెంట తిరిగి, యజమానులు కలిసి లాభనష్టాల్ని తెలుసుకున్నారు. వీరు కలిసిన వాళ్ళలో ఎక్కువగా నష్టపోయిన వాళ్లే ఉండడంతో.. భారీగా పెట్టుబడి పెట్టకుండా చిన్నగా (Made small Investment) ప్రారంభించాలనుకున్నారు ఈ ముగ్గురు సోదరులు. అనుకున్నట్టుగానే 'అగ్రి గ్రీన్ ఫారం' (Agri Green Farm) పేరుతో మొదట ఒక చిన్న రేకుల షెడ్డు నిర్మించి అందులో పది పెట్టలు, రెండు పుంజుల్ని పెంచారు. వాటికి దాణాగా..రాగులు, సజ్జలు, తవుడు, వేశారు. అలా నాటు కోళ్ళ పెంపకం మొదలైంది. మూడేళ్లుగా నాటు కోళ్లను అమ్ముతున్నారు వీరు. అలా వారి వ్యాపారం లాభాల్లో (Good Profits) కొనసాగుతూ వచ్చింది.

    వీరి చూపు కడక్‌నాథ్ కోళ్ల వైపు..

    మొదట్లో నాటు కోళ్లను పెంచిన ఈ అన్నదమ్ములు తర్వాత కౌజు పిట్టలు, పావురాలు, కుందేళ్ళు కూడా పెంచడం ప్రారంభిచారు. అదే సమయంలో నాటు కోళ్లలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కడక్‌నాథ్ కోళ్ల (Kadaknath Chicken) గురించి తెలుసుకున్న ఈ సోదరులు.. అటుగా దృష్టి పెట్టారు. కడక్ నాథ్ కోళ్లకు నిలయమైన మధ్యప్రదేశ్‌.. జాబువ జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి కడక్ నాథ్ కోళ్లను తెచ్చారు. కడక్ నాథ్ కోళ్లు ఏడాదికి 150 గుడ్లు (150 Eggs/Year) పెడుతున్నాయనీ, మార్కెట్లో ఈ కోళ్ల ధర కేజీ రూ.1000 ఉంటుందని తెలిపారు. స్థానికంగా చాలా మంది కస్టమర్లు తమ ఫారం వద్దకే వచ్చి ఈ కోళ్లను కొంటున్నారని వివరించారు రాజు. వీటితో పాటుగా జపాన్ జాతికి చెందిన కౌజు పిట్టలు, కేరళ నుంచి తెచ్చిన కుందేళ్ళు, అమెరికాలో పెరిగే పావురాల్ని వీళ్ళు పెంచుతున్నారు. మనుషులు మాంసాహారంగా వినియోగించే ఈ పక్షులకు ఎలాంటి ఇంజెక్షన్లూ ఇవ్వట్లేదని, పూర్తిగా ఆర్గానిక్ (Organic Chicken) పద్ధతిలో పెంచుతున్నామని రాజు వివరించారు.

    ఎక్కువ ఉత్పత్తి కోసం ఇంక్యూబేటర్ వినియోగం..

    మొదట్లో మామూలుగానే కోళ్ళ పెంపకం చేసినా రాన్రానూ కోళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం, డిమాండ్ పెరగడం వలన సరికొత్త పద్ధతులను వినియోగించాలని ఆలోచించారు. అందులో భాగంగానే కోడి గుడ్లు పొదిగించేందుకు ఇంక్యుబేటర్ (Egg Incubator) వాడుతున్నారు. దీని ద్వారా ఒకేసారి 500 గుడ్లను పొదిగించవచ్చు. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ కోడి పిల్లలు పుడుతున్నాయని, తద్వారా ఎక్కువ కోళ్ళ పెంపకం వీలవుతోందని ఈ సోదరులు తెలిపారు. ఎక్కువ కోళ్లను అమ్మడం ద్వారా ఎక్కువ సంపాదన వస్తోందని, ఈ సంపాదనతో తాము తృప్తిగానే ఉన్నట్లు వివరించారు.

    ఆసక్తి ఉన్న వారికి ఉచిత శిక్షణ, సరఫరా కూడా చేస్తున్నారు..

    నాటు కోళ్ల పెంపకం (Poultry farming) ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఉచిత శిక్షణ (Free Training) ఇస్తున్నట్టు రాజు తెలిపారు. కోళ్ల పంపకంపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చి, అందుకు అవసరమైన దాణా, కోళ్లు, ఇతర మెటీరియల్స్ కూడా తామే సరఫరా చేస్తామని అంటున్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో అష్టకష్టాలు పడే కన్నా సొంత వ్యాపారమే మేలు అంటున్నారు ఈ సోదరులు. నాటు కోళ్ల పంపకంలో విజయం సాధించిన ఈ సోదరులు, తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఫారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. అయితే గత 4 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అన్ని రకాల బ్యాంకుల్నీ ఆర్థిక సాయం కోరుతున్నా.. బ్యాంకు అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:
    పల్లె రాజు:919059960245
    అగ్రి గ్రీన్ వ్యవస్థాపకులు.
    రయదండి గ్రామం.
    అంతర్గాం మండలం,
    పెద్దపల్లి జిల్లా,
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Business Ideas, Investment Plans, Local News, Peddapalli, Success story

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు