Home /News /telangana /

PEDDAPALLI PEDDAPALLI POLICE ARRESTS PSUEDO REPORTERS RECOVERS CASH ABH BRV PSE

Peddapalli: రిపోర్టర్లమంటూ ట్రాలీ డ్రైవర్‌ను దారి దోపిడీ చేసిన దుండగులు!..

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసుల 

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసుల 

రిపోర్టర్లమంటూ ఓ ఆటో ట్రాలీ డ్రైవర్ ను అడ్డగించి ఆపై అతన్ని భయపెట్టి డబ్బులు గుంజారు ఇద్దరు దుండగులు. ఈఘటన రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది

    (E.Santosh, News 18, Peddapalli)

    రిపోర్టర్లమంటూ ఓ ఆటో ట్రాలీ డ్రైవర్ ను అడ్డగించి ఆపై అతన్ని భయపెట్టి డబ్బులు గుంజారు ఇద్దరు దుండగులు. ఈఘటన రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. జైపూర్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... మానుపటి శ్రీనివాస్ వృత్తి రీత్యా ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తమై.. భార్య పద్మతో కలిసి ఆటో ట్రాలీలో చెన్నూరుకి బయలుదేరాడు శ్రీనివాస్. ట్రాలీలో కొన్ని బియ్యం బస్తాలు, కొన్ని సామాన్లు తీసుకొని వెళ్తుండగా మార్గం మధ్యలో నర్వ గ్రామం వద్ద ఇద్దరు వ్యక్తులు ట్రాలీని అడ్డగించారు. తాము విలేకరులమని మీరు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని... పోలీసులకు, సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తామంటూ శ్రీనివాస్ ను బెదిరించారు. అయితే ఆ బియ్యం తమ పొలంలో పండినవే అంటూ శ్రీనివాస్ వివరించగా.. ఏ బియ్యమైనా సరే వాటిని మేము రేషన్ బియ్యం అని మా పేపర్లో రాస్తామని, ఆపై అధికారులు వచ్చి మీ సంగతి తేలుస్తారంటు బెదిరించారు. ట్రాలీ సీజ్ కాకుండా, మీపై కేసు నమోదు కాకుండా పేపర్లో రాయొద్దంటే మాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    దీంతో భయపడ్డ శ్రీనివాస్... తన బామ్మర్థి అయిన తోకిన కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాడు. అనంతరం కుమార్ తీసుకొచ్చిన రూ. 20000 మరియు తన వద్దనున్న రూ. 6000 కలిపి మొత్తం రూ. 26 వేలు దుండగులకు ఇచ్చాడు శ్రీనివాస్. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ అంతు చూస్తామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జైపూర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించామని మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు