హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: యువతకు ఇతడే స్ఫూర్తి.. జాబ్ కోసం ఫ్రీ కోచింగ్..

Peddapalli: యువతకు ఇతడే స్ఫూర్తి.. జాబ్ కోసం ఫ్రీ కోచింగ్..

X
పెద్దపల్లిలో

పెద్దపల్లిలో యువతు ఉచిత శిక్షణ

పోలీస్‌ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్ లో నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

పోలీస్‌ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్ లో నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెల్లవారుజామునే గ్రౌండ్లకు చేరుకొని కోచ్‌ పర్యవేక్షణలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఎన్టీపీసీ csrcd ఆధ్వర్యంలో కోచ్ సుదేష్ ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు యువతి యువకులు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి, ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించింది. ఇక ఫిజికల్‌ ఈవెంట్స్‌ కూడా కొద్ది రోజుల్లో నిర్వహిస్తారనే సంకేతాలు కూడా వచ్చాయి.

ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఎన్టీపీసీ csrcd ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి 7.30 వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అభ్యర్థులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా, గుండె సమస్య ఉన్న వారు డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

ఇది చదవండి: ప్లాస్టిక్ నిషేధంపై పక్కా ప్లాన్.. వరంగల్ పోలీసుల యాక్షన్ షురూ..!

రన్నింగ్‌, జంపింగ్‌ చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. రన్నింగ్‌ అనేది ఒకేసారి కాకుండా క్రమంగా రోజురోజుకూ పెంచుకుంటూ పోవాలి. దీని వల్ల శరీరం ఒత్తిడిని తట్టుకుంటుంది. ఒకేసారి ఎక్కువగా పరుగెత్తితే గుండె వేగం పెరిగి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మెడిటేషన్‌ వల్ల శ్వాస ఇబ్బంది ఉండదు. ఒత్తిడిని తట్టుకుంటాం. ఇక ఫుడ్‌ విషయంలో సిజనల్‌ ఫ్రూట్స్‌, పాలు ఎక్కువ తీసుకోవాలి. నూనెలు, మసాలాలకు దూరంగా ఉండాలి. బాడీ డీహైడ్రేషన్‌ కాకుండా నీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు తప్పనిసరిగా 6నుంచి 8గంటలు నిద్రపోవాలి.

ఇది చదవండి: ఫారెస్ట్ రేంజర్ హత్య.. ఎవరు చంపారో తెలుసా..? పోలీసులేమంటున్నారు..?

పోలీసు ఉద్యోగ నియామకాల్లో మెంటల్‌గా ఎంతైతే బలంగా ఉంటారో ఫిజికల్‌గా అంతే దృఢంగా ఉండడం తప్పనిసరి. ఈ రెండూ ఉంటేనే పోలీసు కొలువు సులుభంగా సాధించవచ్చు. అభ్యర్థులు ఫిజికల్‌ ఈవెంట్స్ ‌లో రాణించేందుకు రెగ్యులర్ ‌గా ప్రాక్టీస్‌ చేయాలి. రన్నింగ్ ‌లో రాణించడం చాలా ముఖ్యం. ముందు నుంచే ప్రాక్టీస్‌ చేయాలి. బాడీ ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం చేయాలి. వీలైనంత వరకు ట్రైనర్‌ సమక్షంలో శిక్షణ తీసుకోవాలి. పట్టుదలతో, ఏకాగ్రత్తగా సాధన చేయాలి. మంచి ఫుడ్‌ తీసుకోవాలి. రెస్ట్‌ తీసుకోవాలి. ఎన్టీపీసీ csrcd ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సుదేశ్ సూచనలు చేస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు