E.Santosh, News18, Peddapalli
దేశి వ్యవసాయం అనేది ఒక్కప్పుడు మానవుని జీవన విధానంలో ఉన్న పద్దతే. రానురాను రసాయన మందుల ప్రభావంతో అది మరుగునపడింది. ఇప్పుడు ఎక్కొడో ఒక చోట మాత్రమే బ్రతికి ఉన్నాయి. కానీ పాత విధానాలు బ్రతికి ఉన్న చోట మనుషులు అరోగ్యoగాను.. భూమి ఆరోగ్యంగాను ఉంటున్నాయి. అక్కడ ఎలాంటి మందులు ఉండవు.. కేవలం ఆవు పంచకం,పేడ, పప్పు, బెల్లంతో తయరు చేసే జీవ అమృతం ఉంటాయి. ఇలా పండే పంట సాగులో ఎన్నో పోషకాలు మనిషిని ఆరోగ్యంగా, భూమిని ఆరోగ్యంగా కాపాడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) మూత్తరం మండలం హారిపూరం గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డిదేశి విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటున్నాడు.
తిరుపతి రెడ్డి మొదట్లో రసాయనాలతో పంట సాగు చేసేవాడు. అలా నష్టాలు వచ్చేవి. అప్పుడే పండిత్ ఎల్చుర్ సలహా మేరకు సుభాష్ పాలేకర్ చెప్పిన దేశి విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం క్లాసులు విని అదే పద్దతిలో పంట వేయడం ప్రారంభించాడు. మొదట్లో కేవలం 20 గుంటలలో దేశి విత్తనాలతో ప్రకృతి పంట సాగు చేశాడు. తర్వాత పూర్తిగాగో ఆధారిత పంట సాగుపై దృష్టి సాధించి తనకు ఉన్న 5 ఎకరాల్లో దేశి విత్తనాలతో ప్రకృతి పంట సాగు చేశాడు. అప్పటి నుండి ఇప్పటికీ 12 ఏళ్లుగా ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలంజీవ అమృతంతో పంట సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు తిరుపతి రెడ్డి.
ప్రకృతి సాగులో తిరుపతి రెడ్డి చేస్తున్న పంట రకాలు..
తిరుపతి రెడ్డి ఏ పంట సాగు చేసినా ప్రకృతి సాగు మాత్రమే చేస్తున్నాడు. పైగా వారు పొలంలో సాగు చేసిన వాటిని మాత్రమే వారు తింటారు. తిరుపతి రెడ్డి తన 5 ఎకరా పొలంలో దేశి విత్తనాలు ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, సెంటెడ్ బియ్యం, ఇలా దేశి పంట సాగు చేస్తున్నారు. ఇంట్లోకి సరిపడా కూరగాయలు, పప్పులు, పసుపు కూడా పండిస్తున్నారు.
దేశి పంట తినడం ద్వారా లాభాలు..
దేశి పంట ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం పకృతిలో పండుతుంది కాబట్టి అది భోజనం ద్వారా తింటే ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు ఉండవు. షుగర్, బిపి వంటి సమస్యలు రావు. ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. మనం ఏది చేసినా బ్రతకడం కోసమే కాబట్టి ప్రశాంతంగా భూమిని బ్రతికిస్తూ మనము బ్రతుకుదాము అంటున్నాడు తిరుపతి రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Money18, Organic Farming, Peddapalli, Telangana