Home /News /telangana /

PEDDAPALLI PEDDAPALLI DISTRICT YOUNG FARMER ACHIEVING BEST RESULTS WITH ALTERNATIVE CROPS SNR PSE BRV

Peddapalli: ప్రత్యామ్నాయ పంటలతోనూ లాభాలు .. సీక్రెట్ తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా యువరైతు

(ప్రత్యామ్నాయ

(ప్రత్యామ్నాయ సాగు లాభమే)

Peddapalli: దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న కాయగూరల పంటలను ఎన్నుకోవాలి. మరీ ముఖ్యంగా అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేదా  రకాల మార్పిడి తప్పకుండా పాటించాలి.

  (santosh,News18,Peddapalli)
  రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటూ తెలంగాణ(Telangana)రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండేలా, అధిక దిగుబడులు అందించే పంటలపై రైతులు దృష్టి సారించాలంటూ ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా వాణిజ్య పంటలు వేస్తూ వచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రత్యామ్న్యాయ పంటల వైపు వెళ్లాలంటే కాస్త సంకోచిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే ప్రత్యామ్నాయ పంటల(Alternative crops)లో లాభాలు పొందవచ్చని పెద్దపల్లి (Peddapalli)జిల్లాకు చెందిన యువ రైతు అంటున్నారు. తొలకరి ప్రారంభంతోనే రైతులు పంటలు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో నేలను బట్టి రైతులు ఎటువంటి పంటలు వేసుకోవాలి వంటి విషయాలపై వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేశారు.

  నేల, నీటి వసతిని బట్టి పంట వేయడం మంచిది..

  ప్రత్యామ్నాయ పంటలు వేయదలచిన రైతులు తమ నేలకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత, ఇతర పరిస్థితులను బట్టి విత్తనాలను ఎన్నుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయడం మంచిది. నీటి వసతి మరియు వర్షాధారిత నేలలో కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయం ఇచ్చే పంటలు వేయడం మంచిది. పొలాల్లో భూసారం పెంచేందుకు గానూ ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడడం మంచిది. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, వచ్చిన ఫలితాలకు సమతుల్యమైన ఎరువులను సమయానుసారంగా వాడడం మంచిది.

  ఇది చదవండి : పౌష్టికాహారం కోసం పొలం బాట పట్టిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మహర్షి -2  ప్రణాళిక పక్కాగా ఉండాలి..

  వాతావరణ వివరాలు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను సాగుచేసుకోవాలి. పంటలలో మన వాతావరణ పరిస్థితులకు మరియు మన పరిస్థితులకు అనువైన రకాలను, అలాగే మన ప్రాంతంలో చీడపీడలను తట్టుకునేలా ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న కాయగూరల పంటలను ఎన్నుకోవాలి. మరీ ముఖ్యంగా అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేదా రకాల మార్పిడి తప్పకుండా పాటించాలి.

  ఇది చదవండి : హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు వాళ్లకే ..ఎప్పుడంటే  అధికారుల సూచనలతో మారిన యువ రైతు ఆలోచన..
  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలానికి చెందిన రమేష్ అనే యువ రైతు..తనకున్న 30 గుంటల పొలంలో 10 రకాల కూరగాయ పంటలు వేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్న్యాయ పంటలపై వ్యవసాయశాఖ అధికారులు, నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు..స్వల్పకాలిక పంటలు వేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందుతున్నాడు రమేష్. పలువురు అధికారులతో ప్రశంసలు కూడా అందుకున్నాడు. 50% సేంద్రీయ పద్దతులు అవలంభిస్తు, కూరగాయల పంటలు పండించడంలో నూతన ప్రయోగాలు చేస్తు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు రమేష్.

  ఇది చదవండి: విద్యార్థుల తలిదండ్రులు ఇది గమనించరూ: పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి  ప్రత్యామ్నాయంతో ఫలితం భేష్..

  వ్యవసాయం అంటే వరి వేయడం ఒకటే కాదు అనేక రకాల పంటలు ఉంటాయని కానీ కొందరిలో అవగాహన లోపం వలన ప్రత్యామ్న్యాయ పంటలపై దృష్టి పెట్టడం లేదని యువ రైతు రమేష్ చెపుతున్నాడు. వరి బదులుగా తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం ఉండే విధంగా చూసుకొని పంట వేస్తే రైతుకు నష్టం జరగకుండా ఉంటుందని రమేష్ అంటున్నాడు. ప్రస్తుతం తనకున్న తక్కువ భూమిలోనే సుమారు 10 రకాల కూరగాయలు పండిస్తున్నాడు రమేష్. కూరగాయల పెంపకంపై అపోహలు పోగొడుతూ ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించి మెరుగైన అవగాహన కార్యక్రమాలు చేయాలని కోరుతన్నారు యువ రైతు రమేష్.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Peddapalli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు