Home /News /telangana /

PEDDAPALLI PEDDAPALLI DISTRICT VILLAGE PRESIDENT SPONSORING MONEY TO MOTIVATE STUDENTS TO STUDY IN GOVT SCHOOLS SNR PSE BRV

Peddapalli: పిల్లల్ని గవర్నమెంట్‌ స్కూల్‌లో చేర్పిస్తే నగదు, కానుకలు ఇస్తున్న సర్పంచ్ ..

(బడికి

(బడికి పంపితే బహుమతులు)

Good Concept: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచాలని..పిల్లల్ని చదివించుకునే స్తోమత లేని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు అవగాహనతో పాటు కానుకలు ప్రకటిస్తూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుల్ని సైతం భాగస్వాములను చేశారు.

ఇంకా చదవండి ...
    (santosh,News18,Peddapalli)
    'చదువు'...జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. అయితే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొందరు పేద పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. అటువంటి వారు కూడా పాఠశాలలకు వచ్చి, మంచి చదువులు చదివేలా..తెలంగాణ ప్రభుత్వం బడిబాట(Badibata) కార్యక్రమం చేపట్టింది. పేదరికంలో మగ్గుతున్న చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలPublic schoolలో ఉచిత సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) ఆధ్వర్యంలో ఈ బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై ఆసక్తి చూపడం లేదు. అటువంటి వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ..తమ గ్రామ పరిధిలో ప్రతి చిన్నారి బడికి వెళ్లేలా ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రచారం చేస్తున్నారు.

    విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని:
    ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులు చదువుకోవాలని..ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం కావాలని పెద్దపల్లి జిల్లా భంలానాయక్ తండా గ్రామ సర్పంచ్ రాజు నాయక్ \"బడిబాట\" కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నాడు సర్పంచ్ రాజు నాయక్. ప్రభుత్వ పాఠశాలలో చేరితే.. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్, పుస్తకాలతో పాటు దూర ప్రాంత విద్యార్థులకు ఉచిత వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ రాజు నాయక్ హామీ ఇచ్చారు. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థి కుటుంబానికి దసరా కానుకగా రూ. 2000 తన సొంత ఖర్చుల నుంచి ఇస్తానని రాజు నాయక్ హామీ ఇచ్చారు. ఊరికి మంచి చేయాలన్న ఆలోచన..గ్రామ ప్రజలకు సాయం చేసే మనసు, ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అందరికి ఉపయోగపడాలనే దృక్పథంతో ఈ విధంగా ముందుకు వెళ్తున్నట్లు రాజు నాయక్ వివరించారు.



    తండా పాఠశాలను తరలిస్తామన్న జిల్లా విద్యాశాఖ అధికారి:
    భంలానాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ కరువైంది. కరోనా అనంతరం ఇక్కడి పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఈక్రమంలో ఇటీవల తండాలోని పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి..\"ఈ ఏడాది పిల్లలు రాకపోతే ఈ పాఠశాలను సమీపంలోని ఇతర పాఠశాలతో కలిపేస్తాము\" అంటూ ఉపాధ్యాయులకు సూచన జారీ చేసి వెళ్లారు. దీంతో ఆలోచనలో పడ్డ ఉపాధ్యాయులు, సర్పంచ్ రాజు నాయక్ తో కలిసి తండాలోని పిల్లలు పాఠశాలలో చేరే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఐదేళ్లు నిండిన పిల్లలందరిని తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అలా చేరే ఒక్కో విద్యార్ధికి ఉచితంగా పుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫామ్‌తో పాటు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తానని ప్రకటించారు.

    ఇది చదవండి: స్కూల్‌కి వెళ్లనని చిన్నారి మారం .. బుజ్జగించి క్లాస్‌లో వదిలివెళ్లిన కలెక్టర్



    ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది:
    బడిబాట కార్యక్రమం ద్వారా ఈ ఏడాది కొత్తగా కనీసం 20 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు సర్పంచ్ రాజు నాయక్. తండాలోని గడప గడప తిరుగుతూ ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలను వివరిస్తూ, తాను సొంతంగా చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ \"బడిబాట\" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇలా విద్యార్ధులకు సొంత డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు ప్రభుత్వ స్కూల్‌లో చేర్పిస్తున్నారని న్యూస్ 18 ప్రతినిధి ప్రశ్నించగా \"గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని\" చెప్పారు. అందులో భాగంగానే బడిబాట కార్యక్రమం ద్వారా తోచిన సాయం చేస్తున్నామని భంలా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు