PEDDAPALLI PEDDAPALLI DISTRICT IT EMPLOYEE WHO SET UP A FREE TRAINING CENTER FOR THE UNEMPLOYED WITH HIS OWN MONEY SNR PSE BRV
Peddapalli: ఆ ఊర్లో చదువు దీపం వెలిగించాలన్న సంకల్పం: ఉచిత శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు
(మార్గదర్శకుడు)
Peddapalli:ఉన్నత చదువులు చదివేందుకు తాను పడ్డ కష్టాలు తోటివారు పడకూడదని భావించిన రవికుమార్..తన ఊరిలోని యువతకు చేదోడుగా నిలవాలని భావించాడు. తన మనసులోని మాటను మరికొందరితో పంచుకుని స్వగ్రామం అంతర్గాంలో "ఏపీజే అబ్దుల్ కలాం" పేరిట ఉచిత శిక్షణ సంస్థను ప్రారంభించాడు.
(santosh,News18,Peddapalli)
ఉన్నత చదువులు చదివేందుకు తాను పడ్డ కష్టాలు తోటివారు పడకూడదని భావించిన రవికుమార్..తన ఊరిలోని యువతకు చేదోడుగా నిలవాలని భావించాడు. తన మనసులోని మాటను మరికొందరితో పంచుకుని స్వగ్రామం అంతర్గాంలో "ఏపీజే అబ్దుల్ కలాం(APJ Abdul Kalam)" పేరిట ఉచిత శిక్షణ కేంద్రం(Free training center)ను ప్రారంభించాడు.
కష్టార్జితంతో సహాయం..
ఐటీలో ఉద్యోగం, వేల రూపాయల జీతం...ఎవరైనా ఏం చేస్తారు!. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. బిందాస్‌గా బతికేయవచ్చు. దాదాపుగా అందరు యువతీయువకులు ఇలానే ఆలోచిస్తారు. మంచి ఉద్యోగం రాగానే రిలాక్స్ అయిపోతారు. మంచి జీతం ఉంటే చాలు.. ఇళ్లు కొనుక్కున్నామా.. కారు వాడుతున్నామా.. ఫ్యామిలీ సెటిల్ అయ్యిందా లేదా..ఎలా సంపాదన పెంచుకుందాం.. లేదా లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేద్దాం.. ఇలానే ఆలోచిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం వారందరికీ భిన్నం. ఐటీలో మంచి ఉద్యోగం ఉన్నా..జీవితంలో వెనుకబడిన వారిని ప్రోత్సహిస్తూ..పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ..ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అందరూ బాగుండాలని..
పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గం మండలానికి చెందిన రవి కుమార్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. అనేక కష్టాలు, ఒడిదుడుకుల మధ్య డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. డిగ్రీ అనంతరం పై చదువుల కోసమని ఉన్న కాస్త భూమిని తాకట్టు పెట్టిన రవి కుమార్, చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఉన్నత చదువులు చదివేందుకు తాను పడ్డ కష్టాలు తోటివారు పడకూడదని భావించిన రవికుమార్..అటువంటి వారి కోసం ఏదైనా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి..ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులకు సూచనలు సలహాలు ఇచ్చేవాడు. తన గ్రామానికి చెందిన యువకులకు పలు ఐటీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేశాడు.
స్వగ్రామంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని..
ఎంతో కష్టపడి, ఇబ్బందులు దాటుకుంటూ ముందుకు వెళ్తున్న రవి కుమార్..తన ఊరిలోని యువతకు చేదోడుగా నిలవాలని భావించాడు. తన మనసులోని మాటను మరికొందరితో పంచుకోగా తన స్వగ్రామం అంతర్గాంలో "ఏపీజే అబ్దుల్ కలాం" పేరిట ఉచిత శిక్షణ సంస్థను ప్రారంభించాడు. ప్రభుత్వ అధికారుల సహాయసహకారాలతో ప్రభుత్వ అధీనంలోని ఓ పాత భవనాన్ని తీసుకొని అందులో పోటీ పరీక్షల నిమిత్తం ఉచిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. సుమారు వంద మందికి పైగా అభ్యర్థులు రవి కుమార్ అందించే కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉచిత శిక్షణ తరగతులకు వస్తున్నారు.
అబ్దుల్ కలామ్ స్పూర్తితో..
"ఏపీజే అబ్దుల్ కలాం జీవితం తనకు ఎంతో స్ఫూర్తి దాయకం, ఆయన రచించిన 'మిషన్ 2020' అనే పుస్తకం నాలో ఉత్తేజాన్ని నింపింది. అందుకే, నా గ్రామంలో ఉన్న యువతీయువకులను ఉన్నత స్థానాల్లో చూడలనేది నా కల" అని చెప్పుకొచ్చాడు రవి కుమార్. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని పోటీ పరీక్షలకు ఉచితంగానే తమ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఇప్పిస్తానని చెబుతున్నాడు. అతి త్వరలో అంతర్గాం గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పటుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు రవి కుమార్. లిబ్రేరీ ఏర్పాటుకు స్థానిక అధికారులు భూమి కేటాయించిన వెంటనే డిజిటల్ లైబ్రరీని గ్రామంలోని యువతీయువకులకు అందుబాటులోకి తెస్తామని అంటున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.